ByMohan
Sun 21st Jan 2024 01:01 PM
సీతమ్మ జాడ కనుక్కుని.. లంక నుండి ఆమెను తీసుకువచ్చే వరకు శ్రీరామునికి అండగా హనుమంతుడు ఉన్నట్లుగా పురాణాలు చెబుతాయి. అందుకే ఆ రామునికి హనుమంతుడిని మించిన భక్తుడు లేడని అంటారు. ఇప్పుడు దేశం మొత్తం రామజపంతో నిండిపోయింది. అయోధ్యలో నూతనంగా రూపుదిద్దుకున్న రామమందిరం ప్రాణ ప్రతిష్ట జరగబోతోంది. అయితే ఈ రామునికి కూడా హనుమంతుడు అండగా ఉంటున్నాడు.. అదెలా అనుకుంటున్నారా?
రీసెంట్‌గా సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. చిన్న సినిమాగా, లిమిటెడ్ థియేటర్లలో మాత్రమే విడుదలైన ఈ సినిమాకు.. ఇప్పటికీ థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయంటే.. ప్రేక్షకులు ఈ సినిమాని ఎంతగా ఓన్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో.. మెగాస్టార్ చిరంజీవి చేత మేకర్స్ ఓ ప్రకటన చేయించారు. ఈ సినిమాకు విక్రయించే ప్రతి టికెట్ నుండి రూ. 5 చొప్పున పక్కన పెట్టి.. అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇస్తామనే నిర్ణయాన్ని చిరంజీవి కూడా మెచ్చుకున్నారు.
హనుమాన్ మేకర్స్ ప్రకటించినట్లుగానే ఇప్పటి వరకు ఈ సినిమాకు విక్రయించిన 53,28,211 టిక్కెట్ల నుంచి రూ.2,66,41,055ను అయోధ్య రామమందిరం కోసం అందిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రీమియర్ షోలకు విక్రయించిన 2,97,162 టిక్కెట్లకుగానూ రూ. 14,85,810 చెక్కును అయోధ్య రామమందిరానికి ఇప్పటికే అందజేసిన మేకర్స్.. ఇప్పటి వరకు అమ్ముడైన మొత్తం టికెట్ల లెక్క చెబుతూ.. 2 కోట్ల 66 లక్షల 41 వేల 55 రూపాయలను అయోధ్య రామునికి ఇచ్చారు.
Hanuman Donates 2.66 Cr for Ayodhya Ram Mandir:
Hanu Man For Shreeram Donates From Ticket Prices For Ayodhya Ram Mandir