Andhra Pradesh

కాంగ్రెస్ మా కుటుంబాన్ని చీల్చి చెత్త రాజకీయాలు చేస్తుంది- సీఎం జగన్-tirupati news in telugu cm jagan sensational comments on congress party dividing ysr family ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


కాంగ్రెస్ డర్టీ గేమ్

ఏపీలో వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. తన వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని ప్రజల్ని ధైర్యంగా అడుగుతున్నానన్నారు. వైసీపీ ప్రభుత్వం విద్యా, వైద్య, పాలనా రంగాల్లో సంచలన మార్పులు తీసుకువచ్చిందన్నారు. అవినీతికి ఆస్కారంలేకుండా, పారదర్శకంగా పాలన చేస్తున్నామన్నారు. అర్హత కలిగిన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 99.5 శాతం హామీలను నెరవేర్చామన్నారు. కాంగ్రెస్‌ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్ ఆడుతుందని మండిపడ్డారు. ఆనాడు అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించారు. అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మా బాబాయ్‌ను మంత్రిగా చేసి నాకు వ్యతిరేకంగా పోటీ చేయించారన్నారు. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోని కాంగ్రెస్‌ ఇప్పుడు షర్మిలను నాపై ప్రయోగించిందన్నారు.



Source link

Related posts

ఢిల్లీలో జ‌గ‌న్ ధ‌ర్నా.. బాబు భ‌యం అదే! Great Andhra

Oknews

Ys Sharmila Security: షర్మిల భద్రతపై కాంగ్రెస్ ఆందోళన

Oknews

పీపుల్ ఛాయిస్ కేటగిరీలో ఏపీ శకటం, సాంస్కృతిక పోటీల్లో మూడో స్థానం- అవార్డులు అందజేత-delhi news in telugu ap govt tableau got third place received awards ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment