Latest NewsTelangana

KA Paul Meets Revanth Reddy To Invite Leaders To Global Peace Economic Summit


KA Paul meets revanth Reddy: తెలంగాణకు పెట్టుబడులు తెచ్చే ఉద్దేశంతో హైదరాబాద్ లో ప్రపంచ శాంతి, ఆర్థిక సదస్సును నిర్వహిస్తున్నట్లుగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ చెప్పారు. గాంధీ జయంతి సందర్భంగా వచ్చే అక్టోబరు 2న ఈ ప్రపంచ శాంతి, ఆర్థిక సదస్సును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు కేఏ పాల్ తెలంగాణ సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇద్దరూ ఈ ప్రపంచ సదస్సు గురించి మాట్లాడుకున్నారు. 

అక్టోబరు 2న హైదరాబాద్ లో ప్రపంచ శాంతి, ఆర్థిక సదస్సుకు ఆతిథ్యం ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారని కేఏ పాల్ ఓ వీడియో ద్వారా తెలిపారు. సదస్సుకు హాజరు కావాలని ఇన్వెస్టర్లను కోరుతూ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఉమ్మడిగా వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో హైదరాబాద్ లో కేఏ పాల్ నిర్వహించే ప్రపంచశాంతి, ఆర్థిక సదస్సుకు పెట్టుబడు దారులు ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. రేవంత్​ రెడ్డి హైదరాబాద్ లో నిర్వహించే ఈ సమావేశానికి ఒప్పుకున్నారని కేఏ పాల్​ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు భారీ పెట్టుబడులు తెచ్చేలా సదస్సు నిర్వహణ చేస్తానని హామీ ఇచ్చారు.



Source link

Related posts

Rains in Telugu states that have changed the weather

Oknews

Tillu Square shooting update టిల్లు హడావిడి ఎక్కడ..?

Oknews

Harish Rao: కాంగ్రెస్ 3 నెలల పాలనలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు: హరీష్ రావు ఆరోపణలు

Oknews

Leave a Comment