TS High Court on Mlc Swearing : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ అమీర్ అలీఖాన్ ను గవర్నర్ తమిళి సై గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించారు. ఆ నియామకాన్ని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు ప్రమాణ స్వీకరాం చేయించవద్దని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసింది.
Source link