Telangana

Medaram Jatara 2024 Updates : 500 సీసీ కెమెరాలు, 14 వేల మంది పోలీసులు



14 వేల మందితో భారీ ఫోర్స్మేడారం అంటేనే పోలీసులకు సవాల్ గా మారే జాతర. జాతరలో(Sammakka Saralamma Jatara 2024) ఏం కొంచెం నిర్లక్ష్యం వహించినా.. తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. దీంతో ప్రతిచోటా పోలీస్ నిఘా ఉండేలా ఈసారి పెద్ద మొత్తంలో బలగాలను మోహరిస్తున్నారు. జాతర పూర్తయ్యే వరకు 14 వేల మందితో భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఐజీ డా.తరుణ్ జోషి మేడారం మహాజాతర బందోబస్తు, నిఘాపై దృష్టి పెట్టి పనులు చేయిస్తున్నారు. గతంలో మేడారం ట్రాఫిక్ ఇన్ఛార్జ్ గా పని చేసిన అనుభవం ఉండటంతో ఆయన జాతరపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇక జాతర మొత్తం మీద ఐజీ, డీఐజీలతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 20 మంది ఎస్పీలు, 42 మంది ఏఎస్పీలు, 140 డీఎస్పీలు, 400 సీఐలు, వెయ్యి మంది ఎస్సైలు, దాదాపు 12 వేల మంది కానిస్టేబుళ్లకు జాతర విధులు కేటాయిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోసుకోకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.



Source link

Related posts

imd said heat waves in some districts in telangana and rains in some places | IMD: భానుడి ఉగ్రరూపం, వరుణుడి కరుణ

Oknews

BRS MP Ramulu: బీఆర్‌ఎస్‌కు షాక్ – బీజేపీలో చేరిన ఎంపీ రాములు

Oknews

మందుబాబులకు బ్యాడ్ న్యూస్, సమ్మర్ ఎఫెక్ట్ తో బీర్ల కొరత-భారీగా పెరిగిన సేల్స్-hyderabad summer heat wave conditions ts liquor chilled beer sales increased ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment