ఏం జరిగిందంటే….బీఆర్‌ఎస్ పార్టీ మంచిర్యా జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తీవ్ర పదజాలంతో దూషిస్తూ చేసిన వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. మంచిర్యాల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన సుమన్…. కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఘాటుగా మాట్లాడారు. కేసీఆర్ విమర్శించిన రేవంత్ రెడ్డికి తన చెప్పును చూపిస్తూ… కొడతానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి కాంగ్రెస్ శ్రేణులు. రాష్ట్రవ్యాప్తంగా పలు స్టేషన్లలో ఫిర్యాదులు కూడా ఇచ్చారు. ఇందులో భాగంగానే…. మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు.
Source link