ఫంక్షన్ హాల్స్ ఫుల్పెళ్లి సీజన్ అంటే పూలు, పండ్లు, ఇతర వ్యాపారాలు జోరందుకుంటాయి. ముఖ్యంగా పెళ్లి మండపాలు, ఫంక్షన్ హాల్స్, క్యాటరింగ్, ఈవెంట్ నిర్వాహకులు, డీజేలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇక ఫొటో, వీడియోగ్రాఫర్లకు ఈ మూడు నెలలు పండుగే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 60 వేల పెళ్లిళ్లు ఈ సీజన్ లో జరుగుతున్నట్టు సమాచారం. కిందటి ఏడాది నవంబర్, డిసెంబర్ లో తక్కువ ముహూర్తాలు ఉండడంతో కొందరు పెళ్లిళ్లను మాఘమాసానికి వాయిదా వేసుకున్నారు. ఇందుకు మూడు, నాలుగు నెలల ముందుగానే ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుని సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్, మియాపూర్, నార్సింగి, కోకాపేట్, ఎల్బీనగర్, చైతన్యపురి, కూకట్పల్లి, షాద్ నగర్, ఇతర ప్రాంతాల్లోని భారీ ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ అయిపోయాయని నిర్వహాకులు చెబుతున్నారు.
Source link