Ben Stokes Into 100 Tests Club: రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగనున్న మూడో టెస్ట్‌కు టీమిండియా(Tea India) సిద్ధం అవుతోంది. ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచి సమఉజ్జీలుగా ఉన్న ఇండియా-ఇంగ్లాండ్‌లకు ఈ మ్యాచ్ కీలకంగా మారనుంది. అయితే ఈ మ్యాచ్‌తో బ్రిటీష్ జట్టు సారధి బెన్ స్టోక్స్(Ben Stokes) వంద టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా చరిత్ర సృష్టించనున్నాడు. స్టోక్స్‌కు రాజ్‌కోట్ టెస్ట్ వందో టెస్టు మ్యాచ్ కానుంది. వైజాగ్ వేదికగా ఇటీవలే ముగిసిన రెండో టెస్టుతో స్టోక్స్ 99 టెస్టులు ఆడేశాడు. దశాబ్దకాలంగా ఇంగ్లండ్‌కు ఆడుతున్న స్టోక్స్ రాజ్‌కోట్ టెస్టును మధుర జ్ఞాపకంగా మలుచుకోవాలని భావిస్తున్నాడు. రాజ్‌కోట్ టెస్టుతో ఈ ఫార్మాట్‌లో ‘సెంచరీ’ కొట్టబోతున్న స్టోక్స్.. ఇంగ్లండ్ తరఫున 15వ క్రికెటర్‌గా నిలుస్తాడు.
ఇంగ్లాండ్ తరపున 100 టెస్టులు ఆడిన ఆటగాళ్లు
జేమ్స్ అండర్సన్ -184
స్టువర్ట్ బ్రాడ్ -167
అలెస్టర్ కుక్ -161
జో రూట్ -137
అలెక్ స్టీవార్ట్ -133
గ్రాహం గూచ్ -118
ఇయాన్ బెల్ -118
డేవిడ్ గోవర్ -117
మైఖెల్ అథర్టన్ -115
కొలిన్ కౌడ్రే -114
జెఫ్రీ బాయ్‌కట్ -108
కెవిన్ పీటర్సన్ -104
ఇయాన్ బోథమ్ -102
గ్రాహమ్ థోర్ప్ -100
ఆండ్రూ స్ట్రాస్ -100
ప్రస్తుతం ఇంగ్లండ్ టెస్టు జట్టులో అండర్సన్, రూట్ మాత్రమే ఉన్నారు. . స్టోక్స్ కూడా సెంచరీ క్లబ్ లో చేరుతుండటంతో ఈ టెస్టులో ఇంగ్లండ్ ఏకంగా ముగ్గురు శతాధిక టెస్టులు ఆడిన క్రికెటర్లతో ఆడే జట్టుతో నిలిచే అవకాశముంది. ఇప్పటివరకూ 99 టెస్టులు ఆడిన స్టోక్స్.. 6,251 పరుగులు చేశాడు. 36.34 సగటుతో 13 సెంచరీలు, 31 అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి. బౌలింగ్‌లో 197 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో ఆరు వేల పరుగులు, 150కి పైగా వికెట్లు తీసిన ఆల్‌రౌండర్లలో జాక్వస్ కలిస్ (13,289 పరుగులు, 292 వికెట్లు), గ్యారీ సోబర్స్ (8,032 పరుగులు, 235 వికెట్లు) తర్వాత స్థానంలో స్టోక్స్ ఉన్నాడు.
పడిక్కల్‌కు చోటు