Sports

India And England 3rd Test Stokes Just A Step Away From Century Match


Ben Stokes Into 100 Tests Club: రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగనున్న  మూడో టెస్ట్‌కు టీమిండియా(Tea India) సిద్ధం అవుతోంది. ఇప్పటికే చెరో మ్యాచ్‌ గెలిచి సమఉజ్జీలుగా ఉన్న ఇండియా-ఇంగ్లాండ్‌లకు ఈ మ్యాచ్‌ కీలకంగా మారనుంది. అయితే ఈ మ్యాచ్‌తో బ్రిటీష్‌ జట్టు సారధి బెన్‌ స్టోక్స్‌(Ben Stokes) వంద టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా చరిత్ర సృష్టించనున్నాడు. స్టోక్స్‌కు రాజ్‌కోట్‌ టెస్ట్‌ వందో టెస్టు మ్యాచ్‌ కానుంది. వైజాగ్‌ వేదికగా ఇటీవలే ముగిసిన రెండో టెస్టుతో స్టోక్స్‌ 99 టెస్టులు ఆడేశాడు. దశాబ్దకాలంగా ఇంగ్లండ్‌కు ఆడుతున్న స్టోక్స్‌ రాజ్‌కోట్‌ టెస్టును మధుర జ్ఞాపకంగా మలుచుకోవాలని భావిస్తున్నాడు. రాజ్‌కోట్‌ టెస్టుతో ఈ ఫార్మాట్‌లో ‘సెంచరీ’ కొట్టబోతున్న స్టోక్స్‌.. ఇంగ్లండ్‌ తరఫున 15వ క్రికెటర్‌గా నిలుస్తాడు. 

 

ఇంగ్లాండ్‌ తరపున 100 టెస్టులు ఆడిన ఆటగాళ్లు

జేమ్స్‌ అండర్సన్‌ -184

స్టువర్ట్‌ బ్రాడ్‌ -167

అలెస్టర్‌ కుక్‌ -161

జో రూట్‌ -137

అలెక్‌ స్టీవార్ట్‌ -133

గ్రాహం గూచ్‌ -118

ఇయాన్‌ బెల్‌ -118

డేవిడ్‌ గోవర్‌ -117

మైఖెల్‌ అథర్టన్‌ -115

కొలిన్‌ కౌడ్రే -114

జెఫ్రీ బాయ్‌కట్‌ -108

కెవిన్‌ పీటర్సన్‌ -104

ఇయాన్‌ బోథమ్‌ -102

గ్రాహమ్‌ థోర్ప్‌ -100

ఆండ్రూ స్ట్రాస్‌ -100

ప్రస్తుతం ఇంగ్లండ్‌ టెస్టు జట్టులో అండర్సన్‌, రూట్‌ మాత్రమే ఉన్నారు. . స్టోక్స్‌ కూడా సెంచరీ క్లబ్‌ లో చేరుతుండటంతో ఈ టెస్టులో ఇంగ్లండ్‌ ఏకంగా ముగ్గురు శతాధిక టెస్టులు ఆడిన క్రికెటర్లతో ఆడే జట్టుతో నిలిచే అవకాశముంది. ఇప్పటివరకూ 99 టెస్టులు ఆడిన స్టోక్స్‌.. 6,251 పరుగులు చేశాడు. 36.34 సగటుతో 13 సెంచరీలు, 31 అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి.  బౌలింగ్‌లో 197 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో ఆరు వేల పరుగులు, 150కి పైగా వికెట్లు తీసిన ఆల్‌రౌండర్లలో జాక్వస్‌ కలిస్‌ (13,289 పరుగులు, 292 వికెట్లు), గ్యారీ సోబర్స్‌ (8,032 పరుగులు, 235 వికెట్లు) తర్వాత స్థానంలో స్టోక్స్‌ ఉన్నాడు.

 

పడిక్కల్‌కు చోటు

దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న కర్ణాటక ప్లేయర్‌(Karnataka batter) దేవదత్‌ పడిక్కల్‌(Devdutt Padikka) టెస్టు జట్టులోకి వచ్చేశాడు. ఇంగ్లాండ్‌(England)తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌కు గాయం కారణంగా దూరమైన కె.ఎల్‌. రాహుల్‌(KL Rahul) స్థానంలో పడిక్కల్‌ జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ సీజన్‍లో కర్ణాటక తరపున పడిక్కల్ అదరగొడుతున్నాడు. పంజాబ్‍తో జరిగిన మ్యాచ్‍లో భారీ శతకంతో చెలరేగిన పడిక్కల్‌.. గోవాతో జరిగిన మ్యాచ్‍లోనూ సెంచరీతో దుమ్మురేపాడు. అక్కడతో కూడా పడిక్కల్‌ జోరు ఆగలేదు. ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరిగిన అనధికారిక టెస్టులో కూడా శతకంతో పడిక్కల్‌ తన ఫామ్‌ను చాటాడు. పడిక్కల్ తన చివరి ఆరు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో ఒక హాఫ్ సెంచరీ, నాలుగు సెంచరీలను నమోదు చేశాడు. ప్రస్తుత రంజీ సీజన్‌లో 4 మ్యాచ్‌లు ఆడిన పడిక్కల్‌ 92.67 సగటుతో 556 పరుగులు చేశాడు. ఈ వరుస సెంచరీలతో పడిక్కల్‌కు టెస్ట్‌ జట్టులో చోటు దక్కింది. టెస్ట్‌ జట్టులో చోటు దక్కడంపై పడిక్కల్‌ స్పందించాడు.



Source link

Related posts

Virat Kohli And Anushka Sharma Expecting Their Second Child Confirms AB De Villiers

Oknews

World Cup 2023, IND Vs PAK: Gautam Gambhir Calls Jasprit Bumrah As Most Lethal Bowler In World Cricket

Oknews

DC Vs GT IPL 2024 Head to Head Records

Oknews

Leave a Comment