Hit And Run Case in Hyderabad: హైదరాబాద్ (Hyderabad)లో ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట హిట్ అండ్ రన్ (Hit And Run) ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, గురువారం ఉదయం బొల్లారం (Bollaram) పరిధిలోని ఓ ప్రమాదం జరిగింది. ఓ వైద్యుడు కారును వేగంగా నడుపుతూ వచ్చి తోపుడు బండ్లపైకి దూసుకెళ్లాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అతని కారును వెంబడించి పట్టుకున్నారు. ఆయన నగరంలో ఓ ఆస్పత్రికి చెందిన న్యూరో సర్జన్ అని తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాదంలో సయ్యద్ షాషా అనే వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. తన ఆస్పత్రిలోనే బాధితునికి చికిత్స అందిస్తానని చెప్పి కారులో తీసుకెళ్లాడు. ఈ క్రమంలో అత్తాపూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి అక్కడి నుంచి వైద్యుడు పరారయ్యాడు. బాధితుని పరిస్థితి విషమంగా ఉందని.. బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నట్లు అతని కుటుంబ సభ్యులు వాపోయారు.
మరిన్ని చూడండి