Mudragada Padmanabham News : వైసీపీలో చేరికపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) అధికారికంగా ప్రకటన చేశారు. ఈనెల 14వ తేదీన జగన్మోహన్ రెడ్డి(YS Jagan) సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. తన కుమారుడు కూడా పార్టీలో చేరుతారని వెల్లడించారు. ఎలాంటి షరతులు లేకుండానే వైసీపీలో చేరుతున్నామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను కానీ, కుమారుడు కానీ పోటీపై ఎలాంటి కండిషన్లు పెట్టలేదన్నారు. ఏలాంటి పదవులు కూడా ఆశించడం లేదని… ప్రజలకు సేవ చేయటమే తన లక్ష్యమన్నారు. వైఎస్ జగన్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గోంటానని వెల్లడించారు.