స్టేట్ ఆడిట్ డిపార్ట్‌మెంట్‌లో Deputy Director హోదాలో ఉన్న మాధురిని ఏపీ టిడ్కో జిఎంగా నియమిస్తున్నట్లు ఫిబ్రవరి 29వ తేదీన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మీ ఉత్తర్వులు జారీ చేశారు. గత ఐదేళ్లుగా ఏపీ టిడ్కో ఎలాంటి నిర్మాణ కార్యక్రమాలను చేపట్టకపోయినా టిడ్కోలో మాధురికి పోస్టింగ్ ఇవ్వడం కేవలం కన్ఫర్డ్ హోదా కోసమేనని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.