Andhra Pradesh

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్-ఈ నెల 9న ఉగాది ఆస్థానం, పలు ఆర్జిత సేవలు రద్దు-tirumala krodhi nama ugadi asthanam panchanga sravanam on april 9th arjitha seva cancelled ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


Tirumala Ugadi Asthanam : ఏప్రిల్ 9న తిరుమల(Tirumala Temple) శ్రీవారి ఆలయంలో క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం(Ugadi Asthanam) నిర్వహించనున్నారు. ఉగాది(Ugadi 2024) పండుగను పురస్కరించుకుని ముందుగా మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం, అనంతరం శుద్ధి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి, విష్వక్సేనులకు విశేష నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య విమాన ప్రాకారం, ఆలయ ధ్వజస్తంభం చుట్టూ స్వామి వారు ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశిస్తారు. అనంతరం శ్రీవారి మూలవిరాట్టు, ఉత్సవమూర్తులను నూతన వస్త్రాలతో అలంకరిస్తారు. అనంతరం బంగారు వాకిలిలో ఆగమ పండితులు, అర్చకులు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం నిర్వహిస్తారు. ఉగాది సందర్భంగా అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం వంటి ఆర్జితసేవలను(Arjitha Seva) టీటీడీ రద్దు చేసింది.



Source link

Related posts

CBN In Delhi: ఢిల్లీలో సిఎం చంద్ర బాబు బిజీబిజీ, హోంమంత్రి అమిత్‌షాతో బాబు భేటీ, ఏపీని ఆదుకోవాలని విజ్ఞప్తి

Oknews

నెల్లూరులో వైద్యురాలి ఆత్మహత్య… విశాఖలో చిన్నారిపై లైంగిక దాడి-suicide of a doctor in nellore sexual assault on a child in visakhapatnam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

మూడు రాజ్యసభ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన వైసీపీ-ycp filed nominations for three rajya sabha seats ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment