Telangana

విషాదం మిగిల్చిన వీకెండ్ ట్రిప్, కారు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మృతి!-hyderabad crime news in telugu software employees car met accident two died ,తెలంగాణ న్యూస్



Hyderabad News : హైదరాబాద్(Hyderabad) లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు(Software Employees)గా పనిచేస్తున్న స్నేహితులు…..వీకెండ్(Weekend Trip) రావడంతో సరదాగా గడిపేందుకు ఓ రిసార్ట్ కు వెళ్లారు. అక్కడ తోటి స్నేహితులతో కలిసి వీరు ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపారు. అర్ధరాత్రి సమయంలో తిరుగు ప్రయాణంలో వేగంగా వెళుతున్న వీరి కారు (Car Accident)అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా….మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాల పాలయ్యారు. ఈ ఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ వద్ద చోటు చేసుకుంది. రాజేంద్ర నగర్ ఎస్సై రవి తెలిపిన వివరాల ప్రకారం….కాకినాడ ప్రాంతానికి చెందిన గౌతం సాయి(24), ఆనంద్ (30), సూర్య తేజ (27), ప్రకాష్(26), తనూజ (25) స్నేహితులు. గచ్చిబౌలి ప్రాంతంలో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో వీరంతా ఉద్యోగం చేస్తున్నారు. శనివారం, ఆదివారం వీకెండ్ హాలిడేస్ కావడంతో…. సూర్య తేజ తన కారులో గౌతం సాయి, ఆనంద్, ప్రకాష్, తనూజలను తీసుకొని శంషాబాద్ ప్రాంతంలోని రిసార్ట్ వెళ్లారు.



Source link

Related posts

Mynampally Rohit Rao | Mynampally Rohit Rao |కౌన్సిలర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మైనంపల్లి రోహిత్

Oknews

Bajireddy Govardhan,Loksabha Elections,Nizamabad, Brs, Bjp, Telangana, Dharmapuri Arvind

Oknews

skill development courses in Telangana degree and btech colleges

Oknews

Leave a Comment