Mudragada Name Change: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చకున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం ఎన్నికలకు ముందు సవాలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ మళ్లీ గెలుస్తుందని, పిఠాపురంలో పవన్ ఓడిపోతారని సవాలు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తాను చెప్పింది జరగకపోతే పేరు మార్చుకుంటానని సవాలు చేశారు.