టీడీపీ కౌంటర్
వైసీపీ ట్వీట్ కు అధికార టీడీపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. జగన్ పాపాలు చేయడంలో శిశుపాలుడికి గాడ్ ఫాదర్ అంటూ ట్వీట్ చేసింది. తానే విషపు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ అయి ఉండి ఇతరులపై విష ప్రచారం చేస్తున్నారని టీడీపీ విమర్శించింది. ఐదేళ్లలో ప్రమాదకర మద్యంతో లక్షలాది జనం ప్రాణాలు తీశారని ఆరోపించింది. ప్రపంచంలో ఎక్కడా దొరకని డేంజరస్ లిక్కర్ త్రీ క్యాపిటల్స్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్, బూమ్ బూమ్, 99 పవర్ స్టార్ ఇవన్నీ జగన్ దోపిడీ కోసం తెచ్చిన బ్రాండ్లు అని కౌంటర్ ఇచ్చింది.