ఐఐటీ మద్రాస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విభాగంవారు సత్యదేవ్ మెమోలో కేవలం 4 సబ్జెక్టులు మాత్రమే ఉన్నాయని, మ్యాథ్స్ ఎ, మ్యాథ్స్ బిలను ఒకే సబ్జెక్ట్‌గా పరిగణిస్తున్నామని, అందువల్ల ఏపీ ఇంటర్మీడియట్ మార్క్స్ పత్రాన్ని అంగీకరించమని సమాచారమిచ్చారు. దీనిపై సత్యదేవ్ ఐఐటి మద్రాసు వారిని సంప్రదించగా, సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్టుకు సంబంధించిన సర్టిఫికెట్‌లో ‘ఇ’ స్థానంలో నిర్దిష్ట సంఖ్యా విలువను కలిగి ఉంటేనే కళాశాలలో ప్రవేశానికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. విద్యార్థి కెరీర్ మొత్తం ఈ ఫలితంపై ఆధారపడి ఉంది. ఈ పరిస్థితి నుండి బయటపడేయడానికి తనకు సహాయం చేయాలని ఈ ఏడాది జూన్ 22వ తేదీన మంత్రి లోకేష్ కు వాట్సప్ ద్వారా మెసేజ్ చేశారు.