AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు ముగియడంతో దానిని మరో మూడు నాలుగు నెలలు పొడిగించేందుకు ఆర్డినెన్స్ జారీ చేయనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో అమల్లో ఉన్న పథకాల కొనసాగింపు, కొత్త పథకాలకు నిధుల కేటాయింపు, ప్రాధాన్యతల వారీగా కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉండటంతో శాసనసభా సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు.