కువైట్‌లో కుక్కలు, బాతులు, మేకలు, గొర్రెలు, పావురాలకు కాపలా ఉండటంతో పాటు ఎడారిలో చెట్లకు నీళ్లు పోసే పనిచేయాల్సి వస్తోందిన వాపోయాడు. జనసంచారం లేని ప్రాంతంలో రాత్రీపగలు ఒక్కడే ఎడారిలో నరకయాతన విలపించాడు. కనీసం తనకు నీళ్లు ఇచ్చేవాళ్లు కూడా లేరని మరో రెండు రోజులు ఆగితే తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ గ్రామానికి చెందిన మిత్రులకు, బంధువులకు వీడియోలు పంపాడు. తన భర్తను తీసుకురావాలంటే మరో లక్ష ఖర్చవుతుందని ఏజెంట్ చెప్పాడని అతని భార్య శంకరమ్మ వాపోయింది.