ప్రజా జీవితంలో ఉన్నవారికి తాము చేసే పోరాటాల మీద గట్టి పట్టు, అవగాహన, పట్టుదల కూడా ఉండాలి. ఒకసారి పోరాటంలోకి దిగిన తర్వాత ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా సరే లెక్క చేయకుండా ముందుకు దూసుకుపోయే తత్వం ఉండాలి. ఏ ఊరికి వెళ్ళినా జనం తనను రిసీవ్ చేసుకునే ధోరణికి ఆశ్చర్యపడిన జగన్మోహన్ రెడ్డి- దేనికి పోరాటం అవసరమో దేనికి అవసరం లేదో విచక్షణ కలిగి ఉండాలని సూచించారు. కానీ ఆయన మాత్రం గాడితప్పి దేనికోసం పోరాటం అవసరమో.. ఏ విషయంలో సర్దుకుపోవాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు.
వినుకొండ రషీద్ హత్య విషయంలో పోలీసులు తెలుగుదేశానికి చెందిన జలీల్ ను అరెస్టు చేశారు. ఇప్పుడు జగన్ డిల్లీలొ ధర్నా చేయాలని కూడా అనుకుంటున్నారు. ఇదేదో శాంతిభద్రతలకు చెందిన వ్యవహారంగా దీక్ష ఆలోచన బాగానే ఉంది.
కానీ.. జగన్ ఢిల్లీ ధర్నా కంటె కూడా ఎక్కువగా తనకు ప్రతిపక్ష హోదా రావడం గురించి ఎక్కువగా ఆరాటపడుతున్నారు. చిన్న చిన్నవిషయాల వద్ద ఆయన పెద్ద పంతానికి పోతున్నారు. నిజానికి ప్రత్యేకహోదా గురించి కూడా ఆయనకు అంత పట్టింపు లేదుగానీ అవసరానికి మించి తనకు ప్రతిపక్ష హోదా మాత్రం కావాలని కోరుకుంటున్నారు.
అందుకోసం స్పీకరుకు లెటరు రాసి.. ఆయన పట్టించుకోకపోవడం వల్ల అభాసు పాలైన జగన్మోహన్ రెడ్డి.. తాజాగా కోర్టులో పిటిషన్ వేశారు. తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా స్పీకరును ఆదేశించాలనేది ఆయన పిటిషన్లోని సారాంశం. విచారణకు కోర్టు స్వీకరించింది.
శాంతి భద్రతల విషయంలో ఎంత గట్టిగా పోరాటాలు చేసినా తప్పులేదు. కానీ ప్రతిపక్ష హోదా గురించి ఆయన ఎందుకింత పట్టుబడుతున్నారో తెలియడం లేదు. హైకోర్టుద్వారా అలాంటి గుర్తింపు దక్కుతుందని అనుకోవడం మాత్రమ భ్రమ. పైగా హైకోర్టులో ఆ కేసు నెగ్గకపోతే.. జగన్ సుప్రీం కోర్టుకు వెళ్లడానికైనా సిద్ధంగానే ఉంటారు గానీ.. అక్కడ కూడా నెగ్గే అవకాశం లేదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇంతకూ జగన్మోహన్ రెడ్డికి కోర్టుకెళ్లడం వంటి సలహాలు ఎందుకిస్తున్నారో.. ఎవరిస్తున్నారో కూడా తెలియడం లేదు. పాత సలహాదారులను మార్చకపోతే.. పరిస్తితి కొత్తగా ఎలా మారుతుందనే భావనలు పార్టీ వారిలోనే వ్యక్తమవుతున్నాయి.