GossipsLatest News

A Big Advantage For Om Bheem Bush? ఓం భీమ్ బుష్ క్యాష్ చేసుకుంటుందా?



Thu 21st Mar 2024 02:55 PM

om bheem bush  ఓం భీమ్ బుష్ క్యాష్ చేసుకుంటుందా?


A Big Advantage For Om Bheem Bush? ఓం భీమ్ బుష్ క్యాష్ చేసుకుంటుందా?

మీడియం హీరో శ్రీవిష్ణు మంచి ఫామ్ లో ఉన్నాడు. సామజవరగమన లాంటి కామెడీ హిట్ తర్వాత మళ్ళీ అదే పంథాలో కామెడీగా ఓం భీమ్ బుష్ అంటూ మాయ చెయ్యడానికి వస్తున్నాడు. అది కూడా బ్రోచేవారెవరురా గ్యాంగ్ తో. రాహుల్ రామకృష్ణ-ప్రియదర్శి-శ్రీవిష్ణు గతంలో బ్రోచేవారెవరురా చిత్రం చేసారు, అది కామెడీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి ఓం భీమ్ బుష్ అంటూ రేపు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. 

గత రెండు నెలలుగా బాక్సాఫీసు వద్ద డబ్బింగ్ చిత్రాలు తప్ప తెలుగు సినిమాలేవీ ప్రేక్షకులని ఇంప్రెస్స్ చెయ్యలేకపోతున్నాయి. వరసగా చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి కానీ ఇంట్రెస్టింగ్ గా ఉన్న సినిమాలేవీ రావడం లేదు. మరి ఈ వారం కూడా పొలోమంటూ చాలా సినిమాలు విడుదలకు సిద్దమవగా.. అందులో శ్రీవిష్ణు ఓమ్ భీం బుష్ మాత్రమే కాస్త ఆసక్తిని కలిగిస్తున్న సినిమా. ఈ చిత్రాన్ని శ్రీవిష్ణు తో కలసి ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలు బాగా ప్రమోట్ చేస్తున్నారు.

ఈ శుక్రవారం చిత్రాన్ని విడుదల చేసి లాంగ్ వీకెండ్ ని క్యాష్ చేసుకునేలా మేకర్స్ బాగానే ప్లాన్ చేసారు. సినిమాకి హిట్ టాక్ పడితే శని, ఆదివారాలతో పాటుగా సోమవారం కూడా కలిసొస్తుంది. సోమవారం హోలీ హాలిడే. మరి ఈ లాంగ్ వీకెండ్ ని ఓం భీమ్ బుష్ ఎంతవరకు క్యాష్ చేసుకుంటుందో చూడాలి. అదే డివైడ్ టాక్ వస్తే ఒక్క రోజుకే కథ ముగిసిపోవడం ఖాయం.


A Big Advantage For Om Bheem Bush?:

Om Bheem Bush releasing tomorrow









Source link

Related posts

నీకసలు బుద్ధి ఉందా.. కల్కి విషయంలో గొడవపడ్డ విశ్వక్ సేన్

Oknews

Indian students change their mindset Huge change with international consequences | Indian Students: రూటు మార్చిన భార‌త విద్యార్థులు, అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో భారీ మార్పు

Oknews

మొత్తానికి అతన్ని అరెస్ట్‌ చేశారు.. నిర్మాతలకు ఇక మంచిరోజులు వచ్చినట్టేనా?

Oknews

Leave a Comment