GossipsLatest News

A shock to Jagan before the election ఎన్నికల ముందు జగన్‍కు షాక్


ఏపీలో ఎన్నికల ముందు సీఎం జగన్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. ఈసీ ఆదేశాలతో ఏపీలో ఐదుగురు IPS, IG లపై వేటు పడింది. 

తెలుగుదేశం నేతల ఫిర్యాదు పై విచారణ జరిపి ఐదుగురు ఐపీఎస్ అధికారులు, ముగ్గురు ఐఏఎస్ అధికారులపై వేటు వేసిన ఎలక్షన్ కమీషన్. అంతేకాకుండా గుంటూరు రేంజ్ IG  పాలరాజుని బదిలీ చేసారు. 

ఈసీ ఆదేశాలతో వేటు పడిన వారిలో 

ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అంబురాజన్ , నెల్లూరు ఎస్పీ కె.తరములేశ్వర్ లు ఉన్నారు. బదిలీ అయిన అధికారులు తమ కింది వారికి తక్షణం బాధ్యతలు అప్పగించి తప్పుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అంతేకాకుండా ట్రాన్స్ఫర్ అయిన అధికారులు ఎన్నికలు పూర్తయ్యే వరకూ విధుల్లో ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. 

మరి జగన్ కి నమ్మిన బంట్లు లా ఉన్న వారిపై ఈ బదిలీ వేటు పడడం ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి బిగ్ షాక్ అనే చెప్పాలి. వీరు ప్రజల కోసం కాకుండా ప్రభుత్వం మెప్పు పొందేందుకే తమ అధికారాన్ని ఉపయోగించారని టీడీపీ నేతలు ఈసీ కి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 





Source link

Related posts

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణపై సస్పెన్షన్ వేటు

Oknews

‘కొంచెం టైమ్‌ ఇవ్వండి.. హ్యాపీగా తిరిగొస్తాను’ : హాస్పిటల్‌లో సునయన

Oknews

Seats Fight Started Between TDP and Janasena టీడీపీ, జనసేనల మధ్య సీట్ల లొల్లి..

Oknews

Leave a Comment