ఓ బిజినెస్ మ్యాన్ తనను వెంబడిస్తూ, లైంగికంగా వేధిస్తున్నాడని మలయాళం హీరోయిన్ హనీ రోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలో ఒక వ్యక్తి నిర్వహించిన ఈవెంటుకు నేను వెళ్లాను. అప్పటి నుండి అతడు నా వెంట పడుతూ, సోషల్ మీడియాలో కూడా నా పరువుతు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నాడు. నేను ఎక్కడి వెళితే అక్కడ ప్రత్యక్షమవుతూ నన్ను ఇబ్బంది పెడుతున్నాడని ఆమె తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అతని మీద చట్ట పరంగా పోరాడుతానని తెలిపారు.
Topics: