Latest NewsTelangana

Additional posts in Group 2 and Group 3 TSPSC exercise for supplementary notifications


TSPSC: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కొత ప్రభుత్వం పాతనోటిపికేషన్లు రద్దుచేస్తూ.. వాటిస్థానంలో కొత్త నోటిఫికేషన్లు ఇస్తూ.. వేగంగా ఉద్యోగాల భర్తీకి అడుగులు వేస్తోంది. స్వల్పకాలంలో టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళనం చేసిన ప్రభుత్వం.. ఉద్యోగాలకు వయోపరిమితిని పెంచడం, మహిళలకు సమాంతర రిజర్వేషన్లు, ఉద్యోగ పరీక్షల ఫలితాలకు సంబంధించి జనరల్ ర్యాంకింగ్ విధానంలో మార్పులు తీసుకొచ్చింది. టీఎస్‌పీఎస్సీ గతంలో విడుదల చేసిన నోటిఫిషన్‌ను రద్దుచేసి, 60 పోస్టులు జతచేస్తూ.. తాాజాగా కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపోమాపో డీఎస్సీ-2023 నోటిఫికేషన్‌ను కూడా రద్దుచేసి 11 వేల పోస్టులతో డీఎస్సీ-2024 నోటిఫిషన్ వెల్లడించనున్నట్లు సమాచారం.   

ఇక గ్రూప్-2, గ్రూప-3 పోస్టుల వంతు..
తెలంగాణలో గ్రూప్‌-2, గ్రూప్‌-3 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ 2022 చివరలో విడుదల చేసిన నోటిఫికేషన్లకు.. అదనపు పోస్టులను కలిపే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. గ్రూప్‌-1 మాదిరే ఈ రెండు ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ అదనపు పోస్టులు కలపాలనేది ప్రభుత్వ యోచనగా తెలుస్తోంది. 2022 గ్రూప్‌-2 నోటిఫికేషన్‌లో కటాఫ్‌ తేదీ ప్రకారం 18 విభాగాల్లో 783 ఖాళీలను చూపారు. ఇప్పటివరకు పెరిగిన పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్‌ ఇవ్వ నున్నదని తెలిసింది.  ప్రస్తుత నోటిఫికేషన్‌కు.. మరికొన్ని కొత్త పోస్టులను జతచేయాలని కమిషన్‌ భావిస్తున్నది. ఇదే నిజమైతే పాత నోటిఫికేషన్‌కు అనుబంధ నోటిఫికేషన్‌ జారీచేస్తారు. ఇందుకు ప్రభుత్వశాఖల నుంచి ఖాళీల వివరాలు రావాలి. ఖాళీలపై ఆర్థికశాఖ ఆమోదమివ్వాలి. మొత్తం మీద గ్రూ ప్‌ -2 పోస్టుల భర్తీకి మరికొంత సమయం పట్టే అవకాశాలున్నాయి. ప్రభుత్వ వర్గాల కథ నం ప్రకారం కొన్ని అదనపు పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్‌ను విడుదల చేయొచ్చు.

ఇక 2022 డిసెంబర్‌ 30న 1,363 పోస్టుల భర్తీకి గ్రూప్‌ -3న నోటిఫికేషన్‌ను జారీచేశారు. ఆ తర్వాత మహాత్మాజ్యోతిబా ఫూలే బీసీ గురుకులాల్లో 12 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులను చేర్చి అదనపు నోటిఫికేషన్‌ ఇచ్చారు. దీంతో పోస్టుల సంఖ్య 1,375కు చేరింది. ఈ పోస్టులకు అదనపు ఖాళీలను కలుపుకొని అనుబంధ నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గ్రూప్‌-3లో ప్రస్తుతం 1375 ఖాళీలు ఉన్నాయి. 

అదనపు సిబ్బందిని కోరిన టీఎస్‌పీఎస్సీ..
వరుస నోటిఫికేషన్లు, పరీక్షల ఒత్తిడి నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీకి అదనంగా సిబ్బందిని ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి ఇటీవలే ప్రభుత్వాన్ని కోరారు. తాజా అవసరాల దృష్ట్యా 150 మంది సిబ్బందిని కేటాయించాలని ప్రభుత్వానికి నివేదించారు. దీంతో 50 మందిని తక్షణమే డిప్యూటేషన్‌ మీద, మరో 100 మంది ఉద్యోగులను రిక్రూట్‌చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికలకు ముందు టీఎస్‌పీఎస్సీలో సిబ్బందిలేరంటూ విమర్శించిన ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి టీఎస్‌పీఎస్సీ ప్రతిపాదనలను పక్కనపెట్టేశారు. దీంతో ఉన్న సిబ్బందితో నెట్టుకురాలేక కమిషన్‌ నానా అవస్థలు పడుతోంది.

ALSO READ:

తెలంగాణ డీఎస్సీ-2023 నోటిఫికేషన్ రద్దు? ఒకట్రెండు రోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్!
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించబోతోంది. గత ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దుచేస్తూ.. మరికొన్ని పోస్టులను కలుపుతూ కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకట్రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు సమాచారం. కొత్త నోటిఫికేషన్ ద్వారా దాదాపు 11 వేల టీచర్‌ పోస్టులను భర్తీచేసే అవకాశం ఉంది. ఇటీవలే గత ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దుచేసి గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాగా డీఎస్సీని కూడా రద్దుచేసే యోచనలో రేవంత్ ప్రభుత్వం ఉంది.
వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి…

మరిన్ని చూడండి



Source link

Related posts

Latest Gold Silver Prices Today 27 January 2024 Know Rates In Your City Telangana Hyderabad Andhra Pradesh Amaravati | Latest Gold-Silver Prices Today: గోల్డ్‌ కొనేందుకు గుడ్‌ ఛాన్స్‌

Oknews

ప్రేమలు మొదటి రోజు కలెక్షన్స్.. రాజమౌళి కొడుకు ఏమంటాడో  

Oknews

‘టెట్’ నోటిఫికేషన్ ఉంటుందా…! అభ్యర్థుల డిమాండ్లపై సర్కార్ స్పందించేనా..?-teacher job candidates are demanding to conduct telangana tet exam context of dsc recruitment 2024 ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment