<p>కట్టుకున్న భర్త మద్యం సేవించి నిత్యం ఇంట్లో గొడవ చేస్తున్నాడని విసుగుచెంది భర్తను భార్య గొడ్డలితో నరికి హత్య చేసిన ఈ దారుణ ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎర్వచింతల్ గ్రామానికి చెందిన పిట్ల నడిపి రాజన్న (41) అనే వ్యక్తి నిత్యం మద్యం సేవించి ఇంట్లో రాత్రి గొడవ చేస్తున్నాడని రాజన్న భార్య లక్ష్మ విసుగు చెందింది. ఇంట్లో ఉన్న గొడ్డలితో రాజన్న మెడపై దాడి చేసింది. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఖానాపూర్ సిఐ డి.మోహన్ అధ్వర్యంలో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని రాజన్న హత్య పట్ల విచారణ చేపడుతున్నారు. మృతుడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. రాజన్న హత్య గ్రామంలో చర్చనియంశంగా మారింది.</p>
<p>ఇటు ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలోనూ భార్య చేతిలో భర్త హత్యకు గురయ్యాడు. పాశర్లపూడి బాడవలో వివాహేతర సంబంధం వల్ల జరిగిన ఘర్షణలో భార్య చేతిలో భర్త హత్యకు గురయ్యాడు. పాశర్లపూడి బాడవ పల్లవపాలానికి చెందిన కొల్లు సాయికుమార్‌ అనే 24 ఏళ్ల వ్యక్తి అదే గ్రామానికి చెందిన యువతిని ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. సాయి కుమార్‌ ఇళ్ల సీలింగ్‌ పనులు చేస్తూండగా.. అతని భార్య అదే గ్రామానికి చెందిన కొల్లు వెంకటేశ్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.</p>
<p>ఈ వ్యవహారంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇదే విధంగా ఈ నెల 17వ తేదీ రాత్రి ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ క్రమంలో భర్త సాయి కుమార్‌ చెంపపై భార్య గట్టిగా కొట్టింది. కాసేటికి అతను మృతి చెందాడు. దీంతో హతుని తండ్రి కొల్లు వీరపండు నగరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. సాయి కుమార్‌ మృత దేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తర్వాత ఈ ఘటనపై పి. గన్నవరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పి. గన్నవరం సీఐ ప్రశాంత్‌ కుమార్‌ ఆధ్వర్యంలో నగరం ఎస్సై పి.సురేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.</p>
Source link
next post