Sports

Aiden Markram Reached 2nd Place In ICC World Cup 2023 Top Scorers Check List | Aiden Markram: పరుగుల వేటలో దూసుకెళ్తున్న మార్క్రమ్


Aiden Markram: ప్రపంచకప్‌ 2023లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఎయిడెన్ మార్క్రమ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌‌, పాకిస్తాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్, భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలను దాటేసి ఎయిడెన్‌ మార్క్రమ్‌ ఈ స్థానంలో నిలిచాడు.

అంతకుముందు డేవిడ్ వార్నర్ నాలుగో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ ఐదో స్థానంలో ఉన్నాడు. అయితే ఇప్పుడు ఎయిడెన్ మార్క్రమ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ నాలుగో స్థానానికి, విరాట్ కోహ్లీ మూడో స్థానానికి పడిపోయాడు.

అత్యధిక పరుగులు చేసింది వీరే…
ఈ వార్త రాసే సమయానికి ఎయిడెన్ మార్క్రమ్ 356 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ క్వింటన్ డికాక్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. క్వింటన్ డికాక్ ఆరు మ్యాచ్‌ల్లో 71.83 సగటుతో 431 పరుగులు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో క్వింటన్ డి కాక్ ఏకంగా మూడుసార్లు సెంచరీ మార్కును దాటాడు. ఈ జాబితాలో భారత దిగ్గజం విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లి ఐదు మ్యాచ్‌ల్లో 118 సగటుతో 354 పరుగులు చేయగా… పాకిస్థాన్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ 6 మ్యాచ్‌ల్లో 66 సగటుతో 333 పరుగులు చేశాడు.

భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఎక్కడ?
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఐదు మ్యాచ్‌ల్లో 66.40 సగటుతో 332 పరుగులు చేశాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఐదు మ్యాచ్‌ల్లో 62.20 సగటుతో 311 పరుగులు చేశాడు. అదే సమయంలో, దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్ 6 మ్యాచ్‌ల్లో 50 సగటుతో 300 పరుగులు చేశాడు.

క్వింటన్ డి కాక్‌తో పాటు, విరాట్ కోహ్లీ, ఎయిడెన్ మార్క్రమ్, మహ్మద్ రిజ్వాన్, డేవిడ్ వార్నర్‌ల పేర్లు ఈ లిస్టులో ఉన్నాయి. ఇది అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ టాప్ 5 జాబితా. ఇది కాకుండా టాప్-10కు వెళ్తే హెన్రిచ్ క్లాసెన్, సదీర సమరవిక్రమ, రచిన్ రవీంద్ర, డారీ మిచెల్ వంటి పేర్లు కూడా ఉన్నాయి.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial



Source link

Related posts

మరో నాలుగు క్రీడలు కూడా..-ioc approves cricket in 2028 los angeles olympics and four more sports also ,స్పోర్ట్స్ న్యూస్

Oknews

Hardik Pandya implicitly admitted that he had a rift with Rohit

Oknews

DC Vs GT IPL 2024 Head to Head Records

Oknews

Leave a Comment