Women football players accuse drunk AIFF member of assault: తమపై భౌతిక దాడికి పాల్పడ్డారు అంటూ అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (AIFF)కు చెందిన ఓ సభ్యుడిపై ఇద్దరు మహిళా క్రీడాకారిణులు ఆరోపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సమాఖ్య ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా ఉన్న దీపక్ శర్మ(Deepak Sharma), ఆయన హిమాచల్ ఫుట్‌బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కూడా. 28 వ తేదీ రాత్రి భోజనం తరువాత ఈ దాడి జరిగిందని.. ఈ సమయంలో దీపక్ మద్యం మత్తులో ఉన్నారని మహిళా క్రీడాకారిణులు ఆరోపించారు.
ఇద్దరు క్రీడాకారిణుల ఆరోపణలు
హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఖాద్ ఫుట్‌బాల్ క్లబ్(Khad FC women footballers)కు చెందిన ఇద్దరు క్రీడాకారిణులు ఈ ఆరోపణలు చేశారు. ఫుడ్ తయారీ విషయంలో ఆగ్రహానికి గురైన దీపక్ తమపై దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. డిన్నర్ పూర్తైన తర్వాత , గుడ్లు ఉడకపెట్టుకునేందుకు రూమ్‌కు వెళ్ళయిన విషయంపై ఆగ్రహానికి గురైన దీపక్ శర్మ తమ గదులలో దూసుకొచ్చి మరీ భౌతిక దాడికి పాల్పడ్డారాని ఆరోపించారు. అప్పుడు ఆయన మద్యం మత్తులో ఉన్నారని, అలాగే హిమాచల్ ప్రదేశ్ నుంచి గోవాకు వస్తోన్న సమయంలో కూడా ఆయన తమ ముందే తాగారని అందులో పేర్కొన్నారు. ఇండియన్ విమెన్ లీగ్‌లో భాగంగా ఈ బృందం ప్రస్తుతం గోవాలో ఉంది.
రంగంలోకి దిగిన గోవా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధికారులు క్రీడాకారుణులు ఉన్న హోటల్ రూమ్ వెళ్లి వారికి ధైర్యం చెప్పారు. పోలీసులకి సమాచారం అందించారు. వారి భద్రతపై రాతపూర్వక హామీ ఇచ్చారు. అయితే ఈ విషయాలను దీపక్ శర్మ తోసిపుచ్చారు. క్రమశిక్షణ పాటించడం లేదని ఆటగాళ్లను తాను తిట్టానని, కానీ ఎవరో కావాలని వాస్తవాలని వక్రీకరించారని ఆరోపించారు. 28 రాత్రి ఈ వివాదం జరిగినప్పుడు తన భార్య కూడా తనతో ఉన్నారన్నారు. అలాగే ఈ విషయంపై ఏఐఎఫ్‌ఎఫ్ తాను వివరణ ఇచ్చానని చెప్పారి. మరోవైపు దీనిపై ఏఐఎఫ్‌ఎఫ్వి మెన్ ఫుట్‌బాల్ కమిటీ ఛైర్‌పర్సన్ వాలంకా అలెమావో స్పందించి, విచారణకు ఆదేశించినట్టు సమాచారం.
ఇప్పటికీ రగులుతున్న రెజ్లర్ల వివాదం
గతంలో భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్.. తమను లైంగికంగా వేధించినట్లు మహిళా రెజ్లర్లు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో బజరంగ్, వినేశ్, సాక్షి మాలిక్ వంటి స్టార్ రెజర్లు జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనకు నాయకత్వం వహించారు, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పలువురు రెజ్లర్ లను లైంగికంగా వేధించారని, అతనిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో వారు నిరసనను విరమించారు. ఈ క్రమంలో పాలక వర్గాన్ని కేంద్ర మంత్రిత్వశాఖ సస్పెండ్ చేసి.. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, సహాయకుడు లేదా బంధువు ఎవరూ రెజ్లింగ్ సంస్థ తదుపరి ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించబడరని కూడా రెజ్లర్లకు హామీ ఇచ్చింది. దీంతో బ్రిజ్ భూషణ్ కుమారుడు ప్రతీక్, అల్లుడు విశాల్ సింగ్ ఎన్నికల పోటీలో పాల్గొనలేదు. అతని సహాయకుడు సంజయ్ సింగ్ నామినేషన్ మాత్రం క్లియర్ అయ్యింది. సంజయ్ సింగ్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
మరిన్ని చూడండి