Telangana

all banks will be open on this sunday as per rbi guideline you can avail these services



Banks Works on Sunday: భారతదేశంలో ప్రతి ఆదివారం బ్యాంకులకు సెలవు. ఇది కాకుండా, నెలలో రెండో & నాలుగో శనివారం కూడా మూతబడాయి. అయితే, ఈ వారం అందుకు భిన్నంగా సాగనుంది. ఈ వారంలో శని, ఆదివారాల్లో బ్యాంకులు తెరిచి ఉంటాయి.
RBI నోటిఫికేషన్బ్యాంక్‌ సెలవుల గురించి రిజర్వ్ బ్యాంక్ (RBI) ఈ నెల 20న ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్‌ ప్రకారం… 2024 మార్చి 30, శనివారం రోజున & మార్చి 31 ఆదివారం రోజున అన్ని ఏజెన్సీ బ్యాంకులు పని చేయాలని, ఆ బ్యాంక్‌ల అన్ని శాఖలు తెరిచి ఉంచాలని ఆదేశించింది. RBI నోటిఫికేషన్ వర్తించే అన్ని బ్యాంకుల శాఖలు ఈ శనివారం, ఆదివారం తెరిచే ఉంటాయి. ఈ బ్యాంక్‌ ఉద్యోగులకు ఈ వారాంతంలో సెలవులు రద్దయ్యాయి.
ఈ వారాంతంలో అన్ని ఏజెన్సీ బ్యాంకులు పని చేయాలని ఆర్‌బీఐ ఆదేశించడానికి కారణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) ముగింపు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. ఆ తర్వాత, కొత్త ఆర్థిక సంవత్సరం ‍(2024-25‌) 01 ఏప్రిల్ 2024 నుంచి ప్రారంభమవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి రోజు (మార్చి 31) ఆదివారం నాడు వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరిగే అన్ని ప్రభుత్వ లావాదేవీలను ఈ ఆర్థిక సంవత్సరం ఖాతాల్లో నమోదు చేయాలని రిజర్వ్ బ్యాంక్ చెబుతోంది. ఈ కారణంగా, ఈ ఆర్థిక సంవత్సరం చివరి రెండు రోజును ఏజెన్సీ బ్యాంక్‌లు పనిదినంగా పాటించాలని, ఆదివారం అయినప్పటికీ అన్ని శాఖలను తెరవాలని ఆదేశించింది.
లిస్ట్‌లో 33 బ్యాంక్‌లుఏజెన్సీ బ్యాంకులు అంటే ప్రభుత్వ లావాదేవీలను సెటిల్‌ చేసేందుకు అధికారం ఉన్న బ్యాంకులు. ఏజెన్సీ బ్యాంకుల్లో 12 ప్రభుత్వ బ్యాంకులు సహా మొత్తం 33 బ్యాంకులు ఉన్నాయి. అవి.. 
ప్రభుత్వ రంగ బ్యాంకులు
1. బ్యాంక్ ఆఫ్ బరోడా2. బ్యాంక్ ఆఫ్ ఇండియా3. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర4. కెనరా బ్యాంక్5. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా6. ఇండియన్ బ్యాంక్7. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్8. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్9. పంజాబ్ నేషనల్ బ్యాంక్10. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా11. UCO బ్యాంక్12. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ప్రైవేట్ రంగ బ్యాంకులు
13. యాక్సిస్ బ్యాంక్14. సిటీ యూనియన్ బ్యాంక్15. DCB బ్యాంక్16. ఫెడరల్ బ్యాంక్17. HDFC బ్యాంక్ 18. ICICI బ్యాంక్ 19. IDBI బ్యాంక్ 20. IDFC ఫస్ట్‌ బ్యాంక్21. ఇండస్‌ఇండ్ బ్యాంక్ 22. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ 23. కర్ణాటక బ్యాంక్ 24. కరూర్ వైశ్యా బ్యాంక్ 25. కోటక్ మహీంద్ర బ్యాంక్ 26. RBL బ్యాంక్ 27. సౌత్ ఇండియన్ బ్యాంక్ 28. యెస్ బ్యాంక్ 29. ధనలక్ష్మి బ్యాంక్ 30. బంధన్ బ్యాంక్ 31. CSB బ్యాంక్ 32. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ 
విదేశీ బ్యాంకులు
33. DBS బ్యాంక్ ఇండియా 
రిజర్వ్ బ్యాంక్ నోటిఫికేషన్ ప్రకారం, ప్రభుత్వ వ్యవహారాలతో ముడిపడిన సెంట్రల్ బ్యాంక్ కార్యాలయాలు కూడా శని & ఆదివారాలు తెరిచి ఉంటాయి.
ఆదివారం నాడు బ్యాంకుల్లో అందే సేవలునోటిఫికేషన్‌లో RBI సూచించిన ప్రకారం…  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి రెండు రోజులూ బ్యాంకులు ఎప్పటిలాగే పని చేస్తాయి, సాధారణ సమయాల ప్రకారమే తెరిచి ఉంటాయి. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS) రెండూ మార్చి 31 అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయి. రెండు రోజుల్లో చెక్ క్లియరింగ్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.
మరో ఆసక్తికర కథనం: రిలయన్స్ షేర్లు రూ.4,442 వరకు వెళ్లొచ్చు!, లెక్కలేసిన గ్లోబల్‌ బ్రోకరేజ్‌

మరిన్ని చూడండి



Source link

Related posts

పార్టీ కార్యకర్తలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వను.!

Oknews

MLC Kavith Arrest Live Updates : లిక్కర్ కేసులో కవిత అరెస్ట్

Oknews

నెలాఖరులోగా మేడారం పనులు పూర్తి, నాణ్యత లేని పనులుచేస్తే సీరియస్ యాక్షన్- మంత్రులు-medaram news in telugu minister seethakka konda surekha reviews on medaram maha jatara 2024 ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment