GossipsLatest News

Anasuya జనసేనలో చేరుతా అని చెప్పానా: అనసూయ


నటి అనసూయ భరద్వాజ్ తనకి వ్యక్తులు ముఖ్యం, పార్టీలు ముఖ్యం కాదు, తనకి నచ్చిన వారు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను.. నాకు జబర్దస్త్ చేస్తున్నప్పటి నుంచి రోజా, నాగబాబు గారితో మంచి సంబంధాలున్నాయి. ఒకవేళ వారు ఇద్దరూ పిలిచినా నేను రాజకీయాల్లో వారికి ప్రచారం చేస్తాను అని చెప్పింది. మరి వేర్వేరు పార్టీల వారిని సపోర్ట్ చెయ్యడం అంత ఈజీ కాదనే విషయం అనసూయ కి తెలియక కాదు.. ఆమె ఏదో చెప్పింది.

అంతేకాకుండా తనకి జనసేన నేత పవన్ కళ్యాణ్ ఎజెండా నచ్చింది, కాబట్టి పవన్ కళ్యాణ్ పిలిస్తే జనసేనకు సపోర్ట్ చేస్తాను, ప్రచారం చేస్తాను అంటూ రజాకార్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో చెప్పిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. దానితో అనసూయ జనసేన పార్టీలో చేరబోతోంది. ఇకపై జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ తరపున ఆమె ప్రచారం చేయబోతుంది అనే టాక్ మొదలైంది.

ఈ ప్రచారంపై అనసూయ తాజాగా స్పందించింది.. తనేం చేసినా అది కాంట్రవర్సీ చేస్తారు, అంటే తుమ్మినా, దగ్గినా దాన్ని కాంట్రవర్సి చేస్తూ ఉంటారు. ఈ మధ్యన ఓ ఇంటర్వ్యూలో రాజకీయాలపై అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాను అంతే. నాయకుడు నచ్చితే, అతని పనితీరు నచ్చితే వాళ్ళకి నా సపోర్ట్ ఉంటుంది అని చెప్పాను, నాయకుడు, పార్టీ అజెండా నచ్చితే సపోర్ట్ చేస్తాను, అంతేకాని జనసేన పార్టీలో చేరుతాను, పార్టీకి ప్రచారం చేస్తాను అని ఎక్కడా చెప్పలేదు. నాకు జనసేన పార్టీ ఎజెండా బాగా నచ్చింది అంటూ అనసూయ రాజకీయాలపై క్లారిటీ ఇచ్చింది.  





Source link

Related posts

Warangal Mixing Sperm in Ice Cream | Warangal Mixing Sperm in Ice Cream | ఐస్ క్రీమ్ లో వీర్యం కలుపుతున్న వ్యక్తి… వైరల్ వీడియో

Oknews

AP election schedule is fixed..! ఏపీ ఎన్నికల షెడ్యూల్ ఫిక్సయ్యిందా..!

Oknews

ఒక్కరోజే 21 సినిమాలు రిలీజ్‌.. ప్రేక్షకులకు పండగే!

Oknews

Leave a Comment