జబర్దస్త్ నటులు సుడిగాలి సుధీర్.. ప్రదీప్ ఇద్దరిలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలని వస్తే ఎవరిని చేసుకుంటారనే ప్రశ్న యాంకర్ రష్మీ గౌతమ్‌కు ఎదురైంది. ఇందుకు ఆమె ఏం చెప్పిందంటే.. తన వర్క్ వేరు, వ్యక్తిగతం వేరని చెప్పింది. రెండూ వేరు వేరుగా వుంటాయి. ఇందులో వుండే వ్యక్తులు అందులోకి రారు. అందులో వుండే వ్యక్తులు ఇందులోకి రారని స్పష్టం చేసింది. అలాగే మీ పెళ్లి లవ్వా, అరేంజ్డ్ మ్యారేజా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు.
సహజీవనం అనే ఆప్షన్ వుందిగా అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. కాగా బుల్లితెర యాంకర్‌గా మంచి క్రేజ్ కొట్టేసిన రష్మీ.. సినిమాల్లో కనిపిస్తూ… కుర్రకారు హృదయాలను దోచేస్తోంది. తాజాగా ట్విట్టర్ లైవ్ ఛాట్‌లో ప్రదీప్‌తో పెళ్లి గురించి స్పందించింది. తనకు పెళ్లి గురించి అడిగే ప్రశ్నలు నచ్చవని రష్మీ చెప్పుకొచ్చింది. పెళ్లికి ముందే తాను ఓ బిడ్డను దత్తత తీసుకుంటానని రష్మీ చెప్పుకొచ్చింది