ByGanesh
Mon 15th Apr 2024 04:26 PM
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్-కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న క్రేజీ పాన్ ఇండియా ఫిలిం దేవర చిత్ర షూటింగ్ కి చిన్నపాటి బ్రేకిచ్చి ఎన్టీఆర్ ప్రస్తుతం హిందీలో లాంచ్ అవుతున్న వార్ 2 సెట్స్ లోకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ తో దేవర చిత్రంలో జాన్వీ కపూర్ రొమాన్స్ చేస్తుండగా.. వార్ 2లో ఎన్టీఆర్ కియారా అద్వానీతో రొమాన్స్ చేస్తారా లేదంటే మరో హీరోయిన్ తోనా అనేది తెలియాల్సి ఉంది.
అయితే జాన్వీ కపూర్ తో పాటుగా ఎన్టీఆర్ దేవర చిత్రంలో మరో మరాఠి బ్యూటీ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె శృతి మరాఠి. దేవర కి తాను భార్య పాత్రలో నటిస్తున్నట్టుగా కూడా శృతి ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. ఇప్పుడు తాజాగా దేవర పై మరో ఇంట్రస్టింగ్ న్యూస్ కూడా వైరల్ అవుతోంది. ఈచిత్రంలో జాన్వీ కపూర్-శృతి మరాఠి తో పాటుగా మరో బాలీవుడ్ బ్యూటీ కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది అని ప్రచారం జరుగుతుంది.
యానిమల్ తో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ గా మారిన త్రిప్తి డిమ్రి దేవర లో మరో కీలక పాత్రలో నటిస్తుంది అంటున్నారు. యానిమల్ సినిమాలో త్రిప్తి దిమ్రి పాత్ర నిడివి తక్కువే అయినా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. యానిమల్ తర్వాత ఆమెకి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. మరి నిజంగా ఆమె దేవరలో భాగమైతే హిందీలో మరింత హెల్ప్ అవడం ఖాయం.
Animal beauty in Devara movie?:
Animal lady Tripti Dimri in Devara ?