ByGanesh
Sun 07th Apr 2024 10:36 AM
ఈమధ్యన క్యూట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ స్టయిల్ మార్చింది. బోల్డ్ లుక్స్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు.. టిల్లు స్క్వేర్ లో సిద్దు జొన్నలగడ్డ తో కలిసి రెచ్చిపోవడం అటుంచి.. ముద్దు సీన్స్ లో ఎలాంటి మొహమాటానికిపోలేదు. అవసరమొచ్చినప్పుడల్లా ఇంటిమేట్ సీన్స్ లో రెచ్చిపోయింది. ఆమెని ఎప్పుడు ట్రెడిషనల్ గా, సాంప్రదాయ పాత్రల్లో చూసిన వారు షాకైపోయారు.
అనుపమ ఏమిటి ఇలాంటి బోల్డ్ రోల్స్ లో నటించడమేమిటి అని గుసగుసలాడడం కాదు, బహిరంగంగానే కామెంట్ చేసారు. సిద్దు జొన్నలగడ్డతో రొమాంటిక్ గా ఉన్న పోస్టర్స్ పై సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ కూడా జరిగింది. గతంలో ముద్దు సీన్స్ లో నటించను, గ్లామర్ షో చెయ్యను అని చెప్పిన అనుపమ ఇంతిలా మారిపోయిందేమిటి అని మట్లాడుకున్నారు. అయితే తాజాగా అనుపమ ఇంటిమేట్ సీన్స్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
నేను ఇలాంటి ఇంటిమేట్ సీన్స్ లో నటించడం పై అందరూ విపరీతంగా రియాక్ట్ అవుతున్నారు. నేను అలాంటి సీన్స్ లో నటించను, అందాలు ఆరబొయ్యను అని చెప్పింది 18 ఏళ్ళ వయసులో. ఇప్పుడు నటనలో, ఏజ్ పరంగా మెచ్యూరిటీ వచ్చింది. ముద్దు సన్నివేశాల్లో నటించడంలో ఎలాంటి తప్పు లేదు, ఒకే రకమయిన మూస పాత్రల్లో నటించి బోర్ కొట్టేసింది, అందుకే కొత్తగా ట్రై చేస్తున్నా, అసలు టిల్లు స్క్వేర్ చూడకుండా విమర్శించడం దారుణం, చూసి విమర్షిస్తే ఓ అందం అంటూ అనుపమ ప్రమేశ్వరన్ చెప్పుకొచ్చింది.
Anupama Parameswaran Opens Up About Romantic scenes:
Anupama Parameswaran Bold Answers About Romantic Scenes