Latest NewsTelangana

Ap And Telangana Postal Gds Second Selection List Released For Document Verification Check Result Here | GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల


దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచ్ పోస్టాఫీసుల్లో 30,041 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి సంబంధించి ఎంపికైన అభ్యర్థుల రెండో జాబితాను అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు పదోతరగతిలో సాధించిన మార్కులు/ గ్రేడ్‌ మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. కంప్యూటర్‌ జనరేటెడ్‌ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఫలితాలకు సంబంధించి మొదటి జాబితాలో ఏపీ నుంచి 510 మంది అభ్యర్థులు, తెలంగాణ నుంచి 589 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు అర్హత సాధించారు. 

గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ పరిధిలో 1,058 పోస్టులు ఉండగా, తెలంగాణ పరిధిలో 961 చొప్పున పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందుకోసం ఆగస్టు 3 నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. తొలి జాబితాలో ఎంపికైన అభ్యర్థులు అక్టోబరు 9లోగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్‌గా సేవలు అందించాల్సి ఉంటుంది. 

ఏపీ నుంచి ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ నుంచి ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం క్లిక్ చేయండి..

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టాఫీసుల్లో 30,041 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్ షెడ్యూల్-2, జులై 2023) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.10,000 – రూ.12,000 ప్రారంభ వేతనం అందుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 23 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్‌లో 1,058, తెలంగాణలో 961 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్ సేవక్‌లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇంటెన్సివ్ ఆధారపడి ఉంటుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్/ కంప్యూటర్/ స్మార్ట్ ఫోన్ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్ తొక్కడం రావాలి.

పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ALSO READ:

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 1,140 ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనీలు, అర్హతలివే
మధ్యప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలీలోని కేంద్ర ప్రభుత్వ మినీ రత్న కంపెనీగా ఉన్న నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 1140 పోస్టులను భర్తీ చేయనున్నారు. మెట్రిక్యులేషన్‌తో పాటు ఐటీఐ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్ 15 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అడకమిక్ మెరిట్, రిజర్వేషన్లు, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఎన్‌ఐఈ, చెన్నైలో 47 టెక్నికల్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులు
చెన్నైలోని ఐసీఎంఆర్‌- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ రెగ్యులర్ ప్రాతిపదికన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 47 టెక్నికల్, ల్యాబొరేటరీ పోస్టులను భర్తీచేయనున్నారు. ప్రస్తుతానికి ఉద్యోగ ప్రకటన మాత్రమే సంస్థ వెల్లడించింది. ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు. రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు ఉంటాయి. టెక్నికల్ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.35,400 – రూ.1,12,400. ల్యాబొరేటరీ అటెండెంట్‌ పోస్టులకు రూ.18,000 – 56,900 వరకు జీతం చెల్లిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..



Source link

Related posts

Vijay to be paired with Meenakshi అదృష్టం అంటే ఈ పాపదే

Oknews

ఓటీటీలోకి టాప్ రేటింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Oknews

ITR 2024 Income Tax Return For FY 2023-24 Before Filing Itr Check These Things

Oknews

Leave a Comment