సంధ్య థియేటర్ సంఘటన అనేక చర్చలకు, నిర్ణయాలకు, రాజకీయ మరియు సినీ ప్రముఖుల విమర్శలకు కేంద్ర బిందువు అవుతోంది. రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకూ తెలంగాణలో ప్రీమియర్ షోలు, ధరల పెంపులు ఉండవని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.
అయితే ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీకి తరలి రావాలని పిలుపునిచ్చారు. తెలుగు సినిమాలు ఏపీలో చేసుకోమని పిలుపునివ్వడం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ లో బెనిఫిట్ షో చూసేందుకు హీరో అల్లు అర్జున్ అక్కడ రావడం, ఆయను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఘటనలో హీరో అల్లు అర్జున్ బాధ్యతా రహితంగా వ్యవహరించారని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు అసెంబ్లీ వ్యాఖ్యలు చేశారు.
Topics: