షర్మిల పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకోనున్న నేపథ్యంలో… ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీ- జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తామని చెప్పాయి. ఇక షర్మిల సోదరుడు, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం సింగిల్ గానే బరిలో ఉంటామని చెబుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్న టైంలో…. పలువురు పార్టీలు మారిపోయారు. అంతేకాదు చాలా మంది నేతలు కూడా ఈ లిస్ట్ లో చేరే అవకాశం ఉంది. ఇరు పార్టీల్లో అసంతృప్త నేతలు ఉన్నారు. పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉందన్న విశ్లేషణలు, అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.