AP EAPCET Admissions 2023: ఫార్మసీ కళాశాలల అనుమతి పొడిగింపునకు ప్రభుత్వం అంగీకరించిన నేపధ్యంలో… రాష్ట్రంలోని బీ ఫార్మసీ, ఫార్మ్-డీ కోర్సుల అడ్మిషన్ షెడ్యూల్ ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఏపీఈఏపీ సెట్ కన్వీనర్ చదలవాడ నాగరాణి సోమవారం విడుదల చేశారు. ఎంపీసీ, బైపీసీ అభ్యర్ధులకు వేర్వేరుగా షెడ్యూలు ఉంటుందన్నారు. ఎంపీసీ విద్యార్ధులు నవంబరు ఒకటి నుండి ఎనిమిదో తేదీ వరకు ఆన్ లైన్ లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని తెలిపారు. ఆన్ లైన్ తో పాటు సహాయ కేంద్రాల వద్ద ధువీకరణ పత్రాల వెరిఫికేషన్ కు నవంబరు 8, 9 తేదీలు కేటాయించామన్నారు. ఐచ్చికాల నమోదుకు నవంబరు 10, 11,12 తేదీలలో మూడు రోజుల పాటు అవకాశం కల్పించామని నాగరాణి వివరించారు. 12 తేదీ ఐచ్చికాల మార్పునకు అవకాశం ఉంటుందని, 14వ తేదీ సీట్ల కేటాయింపును పూర్తి చేస్తామని పేర్కొన్నారు. నవంబరు 15, 16 తేదీలలో సీట్లు పొందిన అభ్యర్ధులు అయా కళాశాలల్లో స్వయంగా రిపోర్డు చేయవలసి ఉంటుదన్నారు.