AP SC ST Employees Complaint: కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది ఏపీ సచివాలయ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం(AP Secretariat SC, ST Employees Union). పదోన్నతుల్లో రిజర్వేషన్ల పదోన్నతుల విషయంపై నియమించిన కమిటీ నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతోందని, ఈ రిపోర్టును సమర్పించకుండా నిలుపులకు ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఈ నివేదిక ఇవ్వడం ద్వారా…. ఉద్యోగ వర్గాల్లో చీలిక తెచ్చేందుకు కొందరు ఉన్నతాధికారులు ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. ఈ నివేదికను సమర్పించటం ద్వారా… ఇతర కులాల ఉద్యోగులు, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టే అవకాశం ఉందని ప్రస్తావించింది. ఫలితంగా ఉద్యోగులను కుల ప్రాతిపాదికన విభజించే ప్రయత్నాలు చేస్తున్నారని, దీని ద్వారా అధికార పార్టీకి లబ్ది చేకూర్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని ఫిర్యాదులో ప్రస్తావించారు.