Latest NewsTelangana

army recruiting office secunderabad invites online applications from unmarried male candidates for selection test for agniveer intake for recruiting year 2024 25 under agnipath scheme | ARO: ‘అగ్నివీరుల’ నియామకానికి ఏఆర్‌వో-సికింద్రాబాద్‌ నోటిఫికేషన్


INDIAN ARMY RECRUITMENT: సికింద్రాబాద్‌లోని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ ‘అగ్నిపథ్’ స్కీమ్ కింద 2024-25 సంవత్సరానికి సంబంధించి అగ్నివీరుల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అవివాహిత పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫిబ్రవరి 13న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. దరఖాస్తుల సమర్పణకు మార్చి 22 వరకు గడువు విధించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్‌ 22 నుంచి ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్షలు నిర్వహించనున్నారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫిజికల్ ఈవెంట్లు, మెడికల్ టెస్టులు నిర్వహించి తుదిఎంపిక చేస్తారు. ఎంపికైనవారు నాలుగేళ్ల కాలానికి అగ్నివీరులుగా పనిచేయాల్సి ఉంటుంది. 

తెలంగాణలోని ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మహబూబాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్, నల్గొండ, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, ములుగు, నారాయణపేట జిల్లాలకు చెందిన అభ్యర్థులు అర్హులు.

వివరాలు…

* అగ్నివీరుల నియామకం

కేటగిరీలు:

➥ అగ్నివీర్ జనరల్ డ్యూటీ 

➥ అగ్నివీర్ టెక్నికల్ 

విభాగాలు: మెకానిక్ మోటార్ వెహికిల్, మెకానిక్ డీజిల్, ఎలక్ట్రానిక్ మెకానిక్, టెక్నీషియన్ పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, డ్రాట్స్‌మ్యాన్, సర్వేయర్, జియో ఇన్‌ఫర్మాటిక్స్ అసిస్టెంట్, ఇన్‌ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్, ఐటీ, మెకానిక్  కమ్ ఆపరేటర్ ఎలక్ట్రిక్ కమ్యూనికేషన్ సిస్టమ్, వెసల్ నేవిగేటర్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఆటోమోబైల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజినీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ.  

➥ అగ్నివీర్ ఆఫీస్‌ అసిస్టెంట్‌/ స్టోర్ కీపర్ టెక్నికల్ 

➥ అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ 

➥ అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ 

అర్హతలు: 

అగ్నివీర్ జనరల్ డ్యూటీ పోస్టులకు 45 శాతం మార్కులతో పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్ కలిగి ఉండాలి.

అగ్నివీర్ టెక్నికల్ పోస్టులకు 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. లేదా సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

అగ్నివీర్ ఆఫీస్‌ అసిస్టెంట్‌/ స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టులకు 60 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. 

అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ పోస్టులకు పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.

అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ పోస్టులకు 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 17.5 – 21 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థలు 01.10.2003 నుంచి 01.04.2007 మధ్య జన్మించి ఉండాలి.

శారీరక ప్రమాణాలు: ఎత్తు: అగ్నివీర్ జీడీ/ట్రేడ్స్‌మ్యాన్ పోస్టులకు 166 సెం.మీ, అగ్నివీర్ టెక్నికల్ పోస్టులకు 165 సెం.మీ, అగ్నివీర్ క్లర్క్/ స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టులకు 162 సెం.మీ. ఉండాలి. ఇక ఛాతీ కొలత గాలి పీల్చినపుడు 5 సెం.మీ విస్తరణతో 77 సెం.మీ. ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.250.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, రిక్రూట్‌మెంట్ ర్యాలీ(ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌/ ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌), వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. 

జీతభత్యాలు: ఎంపికైనవారు కచ్చితంగా నాలుగేళ్లు ఆర్మీలో పనిచేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో మొదటి సంవత్సరం నెలకు రూ.30,000, రెండో సంవత్సరం నెలకు రూ.33,000, మూడో సంవత్సరం నెలకు రూ.36,000, నాలుగో సంవత్సరం నెలకు రూ.40,000 చొప్పున ఇస్తారు. వీటికి ఇతర భత్యాలు అదనం. నాలుగేళ్లు సర్వీసు తర్వాత ‘సేవా నిధి ప్యాకేజీ’ కింద రూ.10.04 లక్షలు ఇస్తారు.  

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 13.02.2024.

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 22.03.2024.

➥ ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభం: 22.04.2024.

Notification

Online Application

Website



Source link

Related posts

ఆరింటిలో ఒక్కచోటైనా కమలం వికసించేనా?

Oknews

Priyanka Mohan ultra stylish look గ్లామర్ బాట పట్టిన పవన్ హీరోయిన్

Oknews

Telugu Student Missing in US : అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మిస్సింగ్

Oknews

Leave a Comment