దిశ, ఫీచర్స్: ఆస్తమా వ్యాధిగ్రస్తులు సాధారణంగానే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. దగ్గు, గురక, శ్వాస ఆడకపోవడం అండ్ ఛాతీ బిగుతుగా ఉండటం వంటివి ఆస్తమా లక్షణాలు. అయితే వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం వల్ల ఫంగస్.. పలు ఇన్ఫెక్షన్లు ఆస్తమా పెషేంట్లలో వ్యాప్తి చెందే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాగా వానాకాలంలో ఆస్తమా ఎటాక్ ప్రమాదం నుంచి బయటపడాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
* ఇన్‌హేలర్: వర్షాకాలంలో ఆస్తమా వ్యాధిగ్రస్తులు తరచూ ఇన్‌హేలర్‌ను అందుబాటులో ఉంచుకోండి. తేమ కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు కాబట్టి ఇన్ హేలర్ బాగా ఉపయోగపడుతుంది. లేకపోతే ఆస్తమా దాడికి గురవుతారు.
* ఇండోర్ మొక్కలు: ఆస్తమా పెషేంట్లు ఉన్న చోట ఇండోర్ మొక్కల్ని ఉంచకండి. అంతేకాకుండా ఇంట్లో ఉన్న మొక్కల్ని తీసి బయటపెట్టండి. ఈ ప్లాంట్స్ గదిలో ఉండటం వల్ల ఆస్తమా రోగులు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిపడతారు. అంతేకాకుండా వర్షాకాలంలో ఆ మొక్కలు దగ్గరగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్లు దరి చేరే అవకాశం ఉంది.
* జలుబు , దగ్గు: వర్షాకాలంలో ఆస్తమా పెషేంట్లో జలుబు, దగ్గు సోకినట్లైతే నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. ఇది ఆస్తమా అటాక్ ప్రమాదాన్నిమరింతగా పెంచే అవకాశం ఉంది. కాగా వైద్యుడి దగ్గరకు వెళ్లి, ట్రీట్‌మెంట్ తీసుకోవడం మేలు.
* ఆహారం: వర్షాకాలంలో ఆస్తమా రోగులు వేడి వాటర్ మూడు పూటలా తాగడం మంచిది. ప్రొటీన్లు పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తినాలి. మేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉన్న ఫుడ్స్ తీసుకోవడం మంచిది.
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ద్వారా అందించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు