Latest NewsTelangana

Attack On Beggars With Knife In Secunderabad And One Dead | Attack On Beggars: సికింద్రాబాద్ లో దారుణం


Attack on Beggars in Secunderabad: సికింద్రాబాద్ (Secunderabad) పరిధిలో ఆదివారం దారుణం జరిగింది. రెండు వేర్వేరు చోట్ల యాచకులపై దుండగులు దాడికి పాల్పడ్డారు. మోండా మార్కెట్ సమీపంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఫుట్ పాత్ పై నిద్రిస్తోన్న యాచకుడిపై ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. మెడను నరికి, తలపై భాగంలో విచక్షణా రహితంగా దాడికి తెగబడ్డారు. దీంతో ఆ యాచకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అలాగే, మారేడ్ పల్లి (Maredpally) పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ ఆలయం సమీపంలో మరో దాడి జరిగింది. నడిచి వెళ్తున్న మరో యాచకుడిపైనా దుండగులు దాడి చేశారు. స్థానికులు గమనించి బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. అరగంట వ్యవధిలోనే ఈ రెండు దాడులు జరగడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. మద్యం మత్తులో దాడి చేశారా.? లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా.? అనేది ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Secunderabad ఆల్ఫా హోటల్ కు బాంబ్ బెదిరింపు కాల్ కలకలం – నిందితుడి అరెస్ట్



Source link

Related posts

రవితేజని ఒప్పిస్తానంటున్న భీమా నిర్మాత..కారణం తెలిసి ఇద్దరి ఫ్యాన్స్ హుషారు

Oknews

సస్పెన్స్‌కు తెర.. పిఠాపురం నుంచే పవన్ పోటీ!

Oknews

ప్రముఖ అగ్ర హీరో విజయ్ సంచలనం…తన పార్టీ పేరు ఇదే 

Oknews

Leave a Comment