ఇండియా ఆస్ట్రేలియా మ్యాచు కు వర్షం ముప్పు పొంచి ఉంది. రాత్రంతా సెయింట్ లూసియాలో వర్షం పడుతూనే ఉంది. ఈ రోజు కూడా పడితే మ్యాచ్ జరిగే అవకాశం లేకపోతే పరిస్థితి ఏంటి సెమీస్ కు వెళ్లే టీమ్స్ ఏంటీ ఈ వీడియోలో చూద్దాం. వర్షం పడకుండా మ్యాచ్ జరిగితే టీమిండియా, ఆస్ట్రేలియా ల్లో ఎవరు గెలిస్తే వాళ్లు సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇండియా గెలిస్తే మూడు మ్యాచులు గెలిచాం కాబట్టి దర్జాగా సెమీస్ కి వెళ్లిపోతాం. ఆస్ట్రేలియా గెలిస్తే మనం ఆఫ్గాన్, బంగ్లా మధ్య జరిగే మ్యాచ్ కోసం చూడాలి. ఇప్పటికే నాలుగు పాయింట్లు ఉన్న భారత జట్టుకు సెమీస్ వెళ్లే అవకాశాలు అప్పటికీ ఎక్కువగానే ఉంటాయి. బట్ ఆఫ్గాన్ గెలిస్తే ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్గాన్ మూడు జట్లకు నాలుగేసి పాయింట్లే ఉంటాయి కాబట్టి..నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉన్న మొదటి రెండు జట్లు సెమీస్ కి వెళ్తాయి. మూడో టీమ్ ఇంటికి వెళ్లిపోతుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఆఫ్గాన్ మీద ఇండియాకు నెట్ రన్ రేట్ చాలా ఎక్కువ ఉంది. సో టీమిండియా గెలిస్తే గోలే ఉండదు. ఓడినా భారీ ఓటమి ఉండకుండా ఉంటే చాలు.