దేశంలో కోరలు చాస్తున్న కరోనా వైరస్ కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. కరోనాను అంతమొందించాలని తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ మేరకు దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించి అమలు చేస్తున్నాయి. అయితే కరోనా కట్టడిలో తామూ భాగమవుతామంటూ స్వచ్చందంగా ముందుకొస్తున్నారు సినీ ప్రముఖులు ప్రభుత్వాలకి విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ తన విరాళాన్ని ప్రకటించారు.
వివరాలలోకి వెళితే టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ హీరో బాలకృష్ణ కరోనాపై పోరాటటానికి తన వంతు ఆర్థిక సాయం అందించారు. మొత్తంగా రూ.1.25 కోట్లు విరాళంగా ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు చెరొక 50 లక్షల రూపాయల చొప్పున కేటాయించిన ఆయన సినీ కార్మికులకు మరో 25 లక్షలు ఇచ్చారు.
Topics: