Bank Holidays List For February 2024: వచ్చే నెలలో (ఫిబ్రవరి 2024), వివిధ జాతీయ సందర్భాలు & ప్రాంతీయ సెలవుల కారణంగా మొత్తం 11 రోజుల పాటు బ్యాంకులు పని చేయవు. రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారం గెజిటెడ్ హాలిడేస్. అంటే, దేశవ్యాప్తంగా ఆ రోజు బ్యాంక్‌లు పని చేయవు. గెజిటెడ్ హాలిడేస్ మినహా మిగిలిన సెలవు రోజులు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండవు, మారతాయి.
వచ్చే నెలలో, దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు మొత్తం 11 రోజులు పని చేయవు. దీనిలో సాధారణ వారాంతపు సెలవులతో (రెండు & నాలుగు శనివారాలు, ఆదివారం) పాటు.. ప్రాంతీయ పండుగలు కూడా కలిసి ఉన్నాయి. ప్రాంతీయ పండుగ సమయంలో నిర్దిష్ట రాష్ట్రాల్లో మాత్రమే సెలవు ఇస్తారు, మిగిలిన రాష్ట్రాల్లో బ్యాంక్‌లు యథావిధిగా పని చేస్తాయి.
బ్యాంక్‌లో మీకేదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే, సెలవు రోజున బ్యాంక్‌కు వెళ్లి మీ సమయం వృథా చేసుకోకుండా, బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ ప్రకారం ముందుగానే మీ పనిని ప్లాన్ చేసుకోవడం మంచిది.
2024 ఫిబ్రవరిలో బ్యాంక్ సెలవు రోజులు (Bank Holidays in February 2024):
2024 ఫిబ్రవరి 4 —— ఆదివారం —— భారతదేశం అంతటా బ్యాంక్‌లకు సెలవు
2024 ఫిబ్రవరి 10 —— రెండో శనివారం —— దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు మూతబడతాయి
2024 ఫిబ్రవరి 11 —— ఆదివారం —— భారతదేశం అంతటా బ్యాంక్‌లు పని చేయవు
2024 ఫిబ్రవరి 14 —— బుధవారం —— బసంత పంచమి/సరస్వతి పూజ (శ్రీ పంచమి)—- అగర్తల, భువనేశ్వర్, కోల్‌కతాలో బ్యాంక్‌లు పని చేయవు
2024 ఫిబ్రవరి 15 —— గురువారం —— లుయి-న్గై-ని —— ఇంఫాల్‌లో బ్యాంక్‌లకు సెలవు
2024 ఫిబ్రవరి 18 —— ఆదివారం —— భారతదేశం అంతటా బ్యాంక్‌లకు సెలవు
2024 ఫిబ్రవరి 19 —— సోమవారం —— ఛత్రపతి శివాజీ జయంతి —— బేలాపూర్, ముంబై, నాగ్‌పుర్‌లో బ్యాంక్‌లు మూతబడతాయి
2024 ఫిబ్రవరి 20 —— మంగళవారం —— రాష్ట్ర దినోత్సవం దినోత్సవం —— ఐజ్వాల్. ఇటానగర్‌లో బ్యాంక్‌లు పని చేయవు
2024 ఫిబ్రవరి 24 —— నాలుగో శనివారం —— దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు మూతబడతాయి
2024 ఫిబ్రవరి 25 —— ఆదివారం —— భారతదేశం అంతటా బ్యాంక్‌లకు సెలవు
2024 ఫిబ్రవరి 26 —— సోమవారం —— న్యోకుమ్ —— ఇటానగర్‌లో బ్యాంక్‌లు పని చేయవు
మరో ఆసక్తికర కథనం: ఫ్యామిలీ పెన్షన్ రూల్స్‌లో సంచలన మార్పు, భర్తలకు భారీ షాక్
బ్యాంక్ సెలవులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేవు
మొబైల్ బ్యాంకింగ్, UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సర్వీస్‌లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి, ఈ సెలవుల వల్ల బ్యాంక్ సేవల్లో దాదాపుగా అంతరాయం ఉండదు. ఈ డిజిటల్ సర్వీస్‌లు 24 గంటలూ, భారతదేశం అంతటా కస్టమర్‌లకు అందుబాటులో ఉంటాయి. ఈ సేవల్లో ఏదైనా ఆటంకం ఉంటే, మీ బ్యాంక్ ముందుగానే మీకు తెలియజేస్తుంది.
భారతదేశంలో, బ్యాంక్ సెలవులు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టం 1881 కింద లిస్ట్ అయ్యాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI), మొత్తం సంవత్సరానికి వార్షిక బ్యాంక్ సెలవుల క్యాలెండర్‌ను ప్రచురిస్తుంది. దీనిని దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు అనుసరిస్తాయి.
మరో ఆసక్తికర కథనం: వారంలో 4 రోజులు పని – 3 రోజులు సెలవులు