Latest NewsTelangana

banks will be closed on account of holi 2024 see bank holidays list for march 2024


Bank Holiday On The Account Of Holi 2024: హిందూ మతానికి సంబంధించిన ముఖ్యమైన పండుగల్లో హోలీ ఒకటి. మరికొన్ని రోజుల్లోనే ఈ రంగుల పండుగ రాబోతోంది. రోడ్లపై ఇంద్రధనస్సులు ఆవిష్కరించే హోలీని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఇచ్చారు. దీనికి అదనంగా మరో రెండు రోజులు, అంటే మొత్తం మూడు రోజులు (హోలీ సెలవుతో కలిపి) హాలిడేస్‌ రానున్నాయి. 

దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఈ నెల 25న, సోమవారం నాడు జరుపుకుంటారు. దీనికి ముందు 23వ తేదీన రెండో శనివారం, 24వ తేదీన ఆదివారం కూడా బ్యాంకులు పని చేయవు. వరుసగా 3 రోజులు హాలిడేస్‌ వస్తున్నాయి కాబట్టి, మీకు బ్యాంక్‌లో ఏదైనా ముఖ్యమైన పని ఉంటే వెంటనే పూర్తి చేయండి. 

చివరి 10 రోజుల్లో 8 రోజులు సెలవులు
ఈ నెల 22 – 31 తేదీల మధ్య బ్యాంకులకు చాలా సెలవులు సిద్ధంగా ఉన్నాయి. బీహార్ డే కారణంగా మార్చి 22న బిహార్‌లోని బ్యాంకులకు సెలవు ఇచ్చారు. మార్చి 23న నాలుగో శనివారం, 24న ఆదివారం కారణంగా బ్యాంకులు మూతపడతాయి. హోలీ కారణంగా వివిధ రాష్ట్రాల్లో మార్చి 25, 26, 27 తేదీల్లో బ్యాంకులకు హాలిడే వచ్చింది. ఆ తర్వాత గుడ్‌ఫ్రైడే, ఆదివారం ఉన్నాయి. ఈ లెక్కన, మార్చి 22 నుంచి 31 వరకు ఉన్న 10 రోజుల్లో బ్యాంకులు 8 రోజులు మూతబడి కనిపిస్తాయి.

ఈ నెలలో బ్యాంక్‌ సెలవు రోజులు

22 మార్చి 2024- బీహార్ డే కారణంగా పట్నాలో బ్యాంకులు మూతబడతాయి
23 మార్చి 2024- నాలుగో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు
24 మార్చి 2024- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
25 మార్చి 2024- హోలీ కారణంగా బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, ఇంఫాల్, కొచ్చి, కోహిమా, పట్నా, శ్రీనగర్, త్రివేండ్రం మినహా దేశంలోని బ్యాంకులకు సెలవు
26 మార్చి 2024- హోలీ లేదా యాయోసాంగ్ డే సందర్భంగా భోపాల్, ఇంఫాల్. పట్నాలోని బ్యాంకులకు సెలవు
27 మార్చి 2024- హోలీ కారణంగా పట్నాలో బ్యాంకులను మూసేస్తారు
29 మార్చి 2024- గుడ్ ఫ్రైడే కారణంగా అగర్తల, గువాహతి, జైపుర్, జమ్ము, సిమ్లా, శ్రీనగర్ మినహా దేశంలోని బ్యాంకులకు సెలవు
31 మార్చి 2024- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు

సెలవు రోజుల్లోనూ మీ పని ఆగదు
ప్రస్తుతం, బ్యాంకింగ్‌ టెక్నాలజీ చాలా పెరిగింది. మొబైల్ బ్యాంకింగ్, UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సర్వీస్‌లు ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, బ్యాంక్‌ హాలిడేస్‌ మీ పనులపై పెద్దగా ప్రభావం చూపవు. ఈ డిజిటల్‌ సర్వీస్‌లు 24 గంటలూ, భారతదేశం అంతటా కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. ఈ సేవల్లో ఏదైనా ఆటంకం ఉంటే, మీ బ్యాంక్‌ ముందుగానే మీకు తెలియజేస్తుంది. 

భారతదేశంలో, బ్యాంక్ సెలవులు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టం 1881 కింద లిస్ట్‌ అయ్యాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI), మొత్తం సంవత్సరానికి వార్షిక బ్యాంక్ సెలవుల క్యాలెండర్‌ను ప్రచురిస్తుంది. దీనిని దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు అనుసరిస్తాయి. 

మరో ఆసక్తికర కథనం: చుక్కలు చూపిస్తున్న పసిడి – తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

మరిన్ని చూడండి



Source link

Related posts

అభ్యర్థుల్లో జగన్ మార్క్ మార్పులు

Oknews

మల్కాజ్ గిరిలో తేల్చుకుందామా..కేటీఆర్ సవాల్.! | KTR Challenges CM Revanth Reddy

Oknews

Electronics Corporation of India Limited ECIL has released notifications for the recruitment of various posts apply now | ECIL: ఈసీఐఎల్‌లో 81 ఉద్యోగాలు

Oknews

Leave a Comment