Team India 2024-25 Home Fixtures: టీమిండియాకు సంబంధించి 2024-25 హోం షెడ్యూలును బీసీసీఐ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం 2025 ఫిబ్రవరి వరకు భారత్‌లో మూడు జట్లు పర్యటించనున్నాయి. 2024 సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడనుంది. బంగ్లాదేశ్ టూర్ పూర్తి అయిన నాలుగు రోజుల వ్యవధిలోనే న్యూజిలాండ్‌లో మూడు టెస్టుల సిరీస్ మొదలవనుంది.
అనంతరం 2025 జనవరి 22వ తేదీ నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లు 2025 ఫిబ్రవరి 12వ తేదీ వరకు జరగనున్నాయి. అంటే 2024-25 సంవత్సరం టీమిండియా మనదేశంలో ఐదు టెస్టులు, మూడు వన్డేలు, ఎనిమిది టీ20లు ఆడనుంది.
ఇక వేదికల గురించి చెప్పాలంటే ఈ మొత్తం 16 మ్యాచ్‌ల్లో హైదరాబాద్‌లో ఒక్క మ్యాచ్ మాత్రమే జరగనుంది. 2024 అక్టోబర్ 12వ తేదీన బంగ్లాదేశ్‌తో జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌కు హైదరాబాద్ వేదిక కానుంది. చెన్నై, పుణే, ముంబై మైదానాల్లో రెండేసి మ్యాచ్‌లు జరగనున్నాయి.