Sports

Bccis Incentive Plan For Test Cricket Report


Bccis Incentive Plan For Test Cricket Report: వ‌న్డేలు, టీ20ల రాక‌తో టెస్టు క్రికెట్‌కు ఆద‌ర‌ణ త‌గ్గిపోతుంది. కొంద‌రు ఆట‌గాళ్లు లీగ్‌లకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. టెస్టు క్రికెట్‌ ఆడే ఆకలి లేని క్రికెటర్లను టీంలోకి తీసుకోవద్దంటూ రోహిత్‌ శర్మ(Rohit Sharma) ఇటీవల వ్యాఖ్యానించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌పై టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చేసిన వ్యాఖ్యలకు క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌(Sunil Gavaskar) కూడా మద్దతు తెలిపాడు. రోహిత్‌ శర్మ వ్యాఖ్యలు పూర్తి నిజమని.. టెస్టు క్రికెట్‌ ఆడాలనుకునే వారినే ఎంపిక చేయాలని సెలక్షన్‌ కమిటీకి సూచించాడు. ఈ సూచనలతో బీసీసీఐ మరిన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్‌ బోర్డు అయిన బీసీసీఐ… సెంట్రల్‌ కాంట్రాక్టులో ఉండి టెస్టులు ఆడే క్రికెటర్లకు మ్యాచ్‌ ఫీజులలో పెంపుతో పాటు బోనస్‌ కూడా ఇవ్వనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

 

బోనస్‌, మ్యాచ్‌ ఫీజు పెరుగుతాయా..?

టెస్ట్‌ క్రికెట్ వైపు మ‌ళ్లించేందుకు ఆట‌గాళ్లకు మ‌రిన్ని బోన‌స్‌ల‌తో పాటు టెస్టుల మ్యాచ్ ఫీజుల‌ను పెంచే ఆలోచ‌న‌లో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఓ క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో ఒక ఆట‌గాడు అన్ని టెస్టులు ఆడితే చెల్లించే బోన‌స్‌లు ఇందులో చేర్చవ‌చ్చున‌ని నివేదిక పేర్కొంది. ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ వంటి క్రికెటర్లు.. టెస్టు క్రికెట్‌ను కాదని ఐపీఎల్‌కు అధిక ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఒక క్యాలెండర్‌ ఈయర్‌లో సదరు ఆటగాడికి రెగ్యులర్‌గా వచ్చే బెనిఫిట్స్‌తో పాటు వారికి అదనంగా రివార్డ్‌ ఇవ్వాలని యోచిస్తున్నామని బీసీసీఐ తెలిపింది. ఆటగాళ్లు టెస్టు క్రికెట్‌ వైపునకు మళ్లేందుకు ఇది తోడ్పడుతోందని తెలిపారు. 

 

నాలుగు గ్రేడ్‌లు

బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్టులో నాలుగు గ్రేడ్స్‌ ఉన్నాయి. వీటిని ఏ+, ఏ, బీ, సీ గా విభజించారు. ఏ+ గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు యేటా రూ. 7 కోట్లు… ఏ కేటగిరీలో క్రికెటర్లకు రూ. 5 కోట్లు, బీ గ్రేడ్‌లో ఉన్న వారికి రూ. 3 కోట్ల వేతనం దక్కుతోంది. సీ గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు వార్షిక వేతనం కింద కోటి రూపాయలు అందుతున్నాయి. టెస్టు మ్యాచ్‌లు ఆడినందుకు గాను ఒక్కో ఆటగాడికి రూ. 15 లక్షలు, వన్డేలు ఆడితే రూ. 6 లక్షలు, టీ20లకు రూ. 3 లక్షలు దక్కుతాయి.

 

రోహిత్‌కు గవాస్కర్‌ మద్దతు

సుదీర్ఘ ఫార్మాట్‌పై టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చేసిన వ్యాఖ్యలకు క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ మద్దతు తెలిపాడు. టెస్టు క్రికెట్‌ ఆడే ఆకలి లేని క్రికెటర్లను టీంలో కి తీసుకోవద్దంటూ రోహిత్‌ శర్మ ఇటీవల వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలను సునీల్ గవాస్కర్‌ సమర్ధించాడు. రోహిత్‌ శర్మ వ్యాఖ్యలు పూర్తి నిజమని.. టెస్టు క్రికెట్‌ ఆడాలనుకునే వారినే ఎంపిక చేయాలని సెలక్షన్‌ కమిటీకి సూచించాడు. తాను ఈ విషయాన్ని ఎప్పటినుంచో చెబుతున్నానని గుర్తు చేశాడు. భారత క్రికెట్‌ వల్లే ప్రతి ఆటగాడికి పేరు, డబ్బు, గుర్తింపు వచ్చాయని భారత క్రికెట్‌పై క్రికెటర్లు విధేయత చూపాల్సిందేనని తేల్చి చెప్పాడు. ఎవరైనా ఏ కారణం చేతనైనా పదే పదే దేశానికి ఆడను అని అంటే కచ్చితంగా యువ ఆటగాళ్లకు మరిన్ని ఎక్కువ అవకాశాలివ్వాలని గవాస్కర్‌ సూచించాడు. ఇలాంటి వైఖరిని సెలెక్టర్లు అలవర్చుకుంటే భారత క్రికెట్‌కు మేలు చేస్తుందని గవాస్కర్‌ అన్నాడు.

 



Source link

Related posts

Gujarat Titans vs Mumbai Indians | Gujarat Titans vs Mumbai Indians

Oknews

అనంత్ రాధికా పెళ్లికి రితికాతో రోహిత్ శర్మ.!

Oknews

Rohit Captaincy Records: కెప్టెన్‌గా వందో మ్యాచ్‌లో రోహిత్ కొత్త రికార్డులు, అరుదైన జాబితాలో చేరిన హిట్ మ్యాన్

Oknews

Leave a Comment