Sports

Beware of Virat Kohli Mohammad Kaif to IPL Teams


Beware of Virat Kohli!! Mohammad Kaif to IPL Teams: మరికొన్ని రోజుల్లో ఐపీఎల్‌((IPL) తొలి దశ మ్యాచ్‌లకు తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లోనే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB), చెన్నై సూపర్‌ కింగ్స్‌(CSK)అమితీమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్‌ కైఫ్‌(Mohammad Kaif)… కోహ్లీ( Virat Kohli) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ రెండేళ్ల నుంచి అద్భుతమైన క్రికెట్ ఆడుతున్నాడని.. ఆసియా కప్‌లో అఫ్గానిస్థాన్‌పై సెంచరీ బాదిన తర్వాత మరింత దూకుడుగా ఉన్నాడని గుర్తు చేశాడు. భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన కోహ్లీకి ఎప్పుడు ఎలా ఆడాలో బాగా తెలుసని అన్నాడు. విరామం తీసుకొని వచ్చాక అతడిని ఆపడం ఎవరితరమూ కాదని… కొందరు విశ్రాంతి తీసుకుని వచ్చాక కుదురుకోవడానికి సమయం తీసుకుంటారని… కోహ్లీ తీరు దానికి భిన్నమని కైఫ్‌ ప్రత్యర్థి జట్లను హెచ్చరించాడు. విరామం తర్వాత బరిలోకి దిగుతున్న కోహ్లీ మరింత ప్రమాదకరంగా ఆడతాడని…. ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే విరాట్ కీలకమని కైఫ్‌ వ్యాఖ్యానించాడు. మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి మ్యాచ్‌లో తలపడనుంది. 

పాక్ క్రికెటర్‌ ఏమన్నాడంటే..? 
కోహ్లీని టీ 20 ప్రపంచకప్‌నకు ఎంపిక చేయకపోతే అంతకన్నా పిచ్చి నిర్ణయం ఇంకోటి ఉండదని పాక్‌ క్రికెటర్‌ మహమ్మద్‌ ఇర్పాన్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. విరాట్‌ను తీసుకోవద్దని చెప్పేవారంతా గల్లీ క్రికెట్‌ ఆడిన వారేనని కూడా విమర్శించాడు. ఇటీవల భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీ విధ్వంసాన్ని చూడలేదా అని నిలదీశాడు. భారత్‌కు కొన్ని మ్యాచుల్లో విరాట్‌ ఒంటిచేత్తో విజయాలు అందించిన విషయాన్ని గుర్తు చేశాడు. కోహ్లీని వచ్చే టీ20 ప్రపంచ కప్‌లోనూ జట్టులోకి తీసుకోవాలని.. భారత జట్టుకు కోహ్లీ అతిపెద్ద ఆస్తి అని ఇర్ఫాన్‌ అన్నాడు. కోహ్లీ ఉంటే మానసికంగా భారత్‌ పైచేయి సాధిస్తుందని కూడా అన్నాడు. విమర్శలు చేసేవారంతా గత ప్రపంచ కప్‌ను గమనించాలని కూడా ఇర్ఫాన్‌ వెల్లడించాడు. కోహ్లీ లేకపోతే భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో భారత్‌ లీగ్‌ స్టేజ్‌లోనే కనీసం 4 మ్యాచ్‌ల వరకు ఓడిపోయేదిన్నాడు . వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ 765 పరుగులు చేశాడు. . తృటిలో వ‌ర‌ల్డ్‌క‌ప్ చేజారినా ఈ టోర్నమెంట్‌లో విరాట్ ఆడిన ఇన్నింగ్స్ అంద‌రికి గుర్తే. 765 ప‌రుగులు సాధించి లీడింగ్ ర‌న్‌స్కోర‌ర్ గా రికార్డ్ సాధించాడు. దాద‌పు 95 యావ‌రేజ్‌తో ఆడిన కోహ్లీ మెత్తం 3 సెంచ‌రీలు, 6 హాఫ్ సెంచ‌రీల‌తో క‌దం తొక్కాడు.

అభిమానుల ఆగ్రహం
అయితే, 2024 టీ20 ప్రపంచ‌కప్‌న‌కు కోహ్లిని ఎంపిక చేయకపోవచ్చే ప్రచారం జ‌రుగుతున్న నేపథ్యంలో విరాట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. టీ20 ల‌కు మాత్ర‌మే కాదు, క్రికెట్ లో కోహ్లీ రికార్డుల‌ను గుర్తుచేస్తున్నారు. గ‌తంలో గెలిపించిన మ్యాచ్‌ల‌ను గుర్తు చేస్తున్నారు. బీసీసిఐ ఈ ఆలోచ‌న‌ను త‌క్ష‌ణం విర‌మించుకోవాల‌నే కింగ్ కోహ్లీ జ‌ట్లులో ఉండాల్సిందే అని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏది ఏమైనా ఈ సారి ఐపీయ‌ల్ ని బీసీసిఐ కూడా చాలాసీరియ‌స్ గా తీసుకొనే అవ‌కాశ‌మే ఉంది. మే మొద‌టి వారంలో జట్టు ఆట‌గాళ్ల వివరాలను ఐసీసీకి అందజేయాల్సి ఉంది. ఈలోగా బీసీసిఐ ఏ నిర్ణ‌యం తీసుకొంటుందా అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని చూడండి



Source link

Related posts

Ravichandran Ashwin Takes Two Wickets In Two Balls To Break Anil Kumbles Record

Oknews

What Happens If India vs England T20 World Cup 2024 Semifinal Is Washed Out

Oknews

Who Is Shamar Joseph Pacer Who Fired West Indies To Win At Gabba

Oknews

Leave a Comment