Latest NewsTelangana

Braou Bed Special Education Admissions Counselling For The Academic Year 2022-23


BEd Special Education: బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఈడీ-స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ ప్రవేశాల కోసం జనవరి 29, 30 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది. వర్సిటీ నిర్వహించిన ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు హైదరాబాద్‌లోని విద్యాలయం ప్రాంగణంలో ప్రవేశాల కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. ఆయా కేంద్రాల్లోని సీట్లలో అన్ని ప్రాంతాలవారికి మెరిట్ ఆధారంగా 15 శాతం కేటాయిస్తారు. మిగతా 85 శాతం సీట్లు స్థానిక విద్యార్థులతో భర్తీచేస్తారు. ఒకవేళ సీట్లు మిగిలితే.. ఇతర విభాగం ఎంచుకున్న వారు కూడా మార్చుకుని ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు కౌన్సెలింగ్ ఫీజు కింద రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. స్పాట్ ప్రవేశాలకు హాజరయ్యే అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఒక జత జిరాక్స్ కాపీలు తీసుకురావాల్సి ఉంటుంది.  ఈ కోర్సు వ్యవధి రెండున్నర సంవత్సరాలు (5 సెమిస్టర్లు). అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే ఫోన్ నెంబర్లు: 04023680291, 7382929570, 7382929580, 7382929590, 7382929600, లేదా కాల్ సెంటర్ నెంబరు: 18005990101 ద్వారా సంప్రదించవచ్చు.

Counselling Website

B.Ed(Special Education) Counselling Intimation letter and College wise seats

B.Ed(Special Education)Counselling Intimation letter in Telugu

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఈడీ, బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఏప్రిల్ 21న విడుదల చేసిన సంగతి తెలిసిందే. సాధారణ డిగ్రీతోపాటు ఇంజినీరింగ్ డిగ్రీ చదివిన అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 21 నుంచి మే 20 వరకు దరఖాస్తులు స్వీకరించింది. అయితే ఇంజినీరింగ్‌లో సైన్స్/ మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. రూ.500 ఆలస్య రుసుముతో మే 28 వరకు దరఖాస్తులు స్వీకరిచింది. అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఫీజుగా రూ.1000 వసూలు చేసింది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.750 చెల్లించారు. అభ్యర్థులు జూన్ 2న ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను విడుదల చేసింది. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 6న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్ష నిర్వహించింది.  

బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) పరీక్ష విధానం ఇలా..
మొత్తం 100 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష పేపరును రెండు భాగాలుగా(పార్ట్-ఎ, పార్ట్-బి) విభజిస్తారు. వీటిలో పార్ట్-ఎ: జనరల్ ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ 40 మార్కులు, పార్ట్-బి: జనరల్ మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ & అనలిటికల్ రీజనింగ్ (వెర్బల్ & అబ్‌స్ట్రాక్ట్ రీజనింగ్) 60 మార్కులు ఉంటాయి. 

ALSO READ:

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ, పీజీ కోర్సులు.
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం జనవరి-ఫిబ్రవరి 2024 సెషన్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీజీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్), డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అభ్యర్థులు ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. ఆసక్తి, సరైన అర్హతలున్నవారు జనవరి 31లోగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తిచేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..



Source link

Related posts

గోదారి నదీ తీరాన విరాజిల్లుతున్న “దక్షిణ అయోధ్య” మన భద్రాద్రి-our bhadradri is the southern ayodhya blooming on the banks of godari river ,తెలంగాణ న్యూస్

Oknews

Bee vs Bee in Kakinada కాకినాడలో బీ వర్సెస్ బీ.. గెలుపెవరిదో!

Oknews

Telangana DSC 2023 Exams Postponed, Due To Assembly Elections

Oknews

Leave a Comment