Latest NewsTelangana

braou has extended application deadline for admissions into bed odl programme


BRAOU Bachelor of Education Programme Admissions: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఈడీ(ఓడీఎల్) (BEd ODL) ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును ఫిబ్రవరి 21 వరకు పొడిగించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు 2023-24కు గాను ఆన్‌లైన్‌లో విశ్వవిద్యాలయ పోర్టల్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ప్రవేశ రుసుము కింద రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు రూ.750 చెల్లిస్తే సరిపోతుంది. అభ్యర్థులు డెబిట్/క్రెడిట్ కార్డు ద్వారా లేదా టీఎస్/ఏపీ ఆన్‌లైన్ ఫ్రాంచైజీ కేంద్రాల్లో ఫీజు చెల్లించవచ్చు. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత రూ.500 ఆలస్యరుసుముతో ఫిబ్రవరి 26 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. మార్చి 5న తెలుగు రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. 

వివరాలు..

➥ దూరవిద్య బీఈడీ ప్రవేశాలు 2023-24

కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు.

మాధ్యమం: తెలుగు.

అర్హతలు..

🔰 కనీసం 50 శాతం మార్కులతో బీఏ/బీఎస్సీ/బీకామ్/బీసీఏ/బీఎస్సీ(హోంసైన్స్)/బీబీఎం/బీబీఏ/బీఈ/బీటెక్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. 

🔰 బీఈ లేదా బీటెక్ విద్యార్థులు తప్పనిసరిగా సైన్స్ లేదా మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. 

🔰 బీసీఏ అభ్యర్థులు ఇంటర్ స్థాయిలో మెథడాలజీ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.

🔰 అభ్యర్థులు 2023 జులై నాటిని క్వాలిఫైయింగ్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

🔰 డిగ్రీలో నిర్ణీత మార్కులు లేని అభ్యర్థులకు పీజీ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. 

🔰 సర్వీసులో ఉన్న ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ టీచర్లు, ఫేస్ టూ ఫేస్ విధానంలో ఎన్‌సీటీఈ గుర్తింపు పొందిన టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

🔰 ఎంబీబీఎస్/బీడీఎస్/బీపీటీ/బీఏఎంఎస్/బీఎల్/ఎల్‌ఎల్‌బీ/బీఫార్మసీ/బీహెచ్‌ఎంటీ/బీవీఎస్సీ/బీఎస్సీ(అగ్రికల్చర్)/బీఏ(లాంగ్వేజెస్)/బీవోఎల్ తదితర ప్రొఫెషనల్ కోర్సులు చేసినవారు బీఈడీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. అదేవిధంగా డిప్లొమా (ఈసీఈ/ పీఎస్ఈ), ప్రీ-ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్/డిప్లొమా (PPTTC) కూడా దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేదు. 

వయోపరిమితి: 01.07.2023 నాటికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎలాంగి గరిష్ఠవయోపరిమి వర్తించదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.

పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. వీటిలో పేపర్-1: జనరల్ ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ 25 మార్కులు, పేపర్-2: తెలుగు ప్రొఫీషియన్సీ 25 మార్కులు, పేపర్-3: జనరల్ మెంటల్ ఎబిలిటీకి 50 మార్కులు కేటాయించారు.

ట్యూషన్ ఫీజు: రూ.40,000.

Notification

Application Fee Payment

Online Application

Website

ALSO READ:

‘స్కిల్ యూనివర్సిటీ’గా మారనున్న స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, ప్రభుత్వం కసరత్తు
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌లోని ‘స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ’ను ‘స్కిల్ యూనివర్సిటీ’గా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదిక సమర్పించాలని పంచాయతీరాజ్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో ఉపాధి కల్పన, పారిశ్రామిక అవసరాలకు అవసరమైన మానవ వనరులను తయారు చేసేందుకుగాను 9 ఉమ్మడి జిల్లాలతో పాటు కొడంగల్‌లోనూ స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇందులో భాగంగానే స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థను స్కిల్ యూనివర్సిటీగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి



Source link

Related posts

దుల్కర్‌ సల్మాన్‌ ఇప్పుడు ‘లక్కీ భాస్కర్‌’

Oknews

Pushpa 2 vs GOAT పుష్ప2 ని లైట్ తీసుకుంటున్నారా?

Oknews

Two wives in the YCP manifesto! వైసీపీ మేనిఫెస్టోలో రెండు మాఫీలు!

Oknews

Leave a Comment