Latest Telugu Breaking News: మద్యం స్కామ్ కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ నేడు విచారణకు రానుంది. 14 రోజులపాటు ఈడీ విచారణ ఎదుర్కొన్న కవిత ప్రస్తుతం జ్యుడీషియల్‌్ రిమాండ్‌లో ఉన్నారు. తన కుమారుడికి పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై స్పెషల్ కోర్ట్ జడ్జి కావేరి బవేజ విచారణ చేపట్టనున్నారు. మరోవైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. ఆయన్ని కోర్టులో హాజరుపరచనున్నారు.
కిరాణ షాప్‌లో గంజాయి
మాదక ద్రవ్యాలపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రోజుకో ప్రాంతంలో సరఫరాదారులను పట్టుకుంటున్నారు. తాజాగా ఓ కిరాణాషాప్‌లో గంజాయి విక్రయిస్తున్న మహిళను అరెస్టు చేశారు. గచ్చిబౌలి పరిధిలోని నానక్‌రామ్‌గూడలో కిరాణషాపులో గంజాయి అముతున్న అనురాధభాయి అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దూల్‌పేట్ నుంచి గంజాయి తీసుకొచ్చి అమ్ముతున్నట్టు ఆమె వివరించారు.
కొన్ని రోజులుగా గంజాయి విక్రయాలపై ఫోకస్ పెట్టిన పోలీసులు ఓవైపు సరఫరాదారులను, అమ్మకందారులను పట్టుకుంటున్నారు. వారు ఇచ్చిన సమాచారంతో మరింత మందిపై దృష్టిపెట్టారు. వాళ్లను పక్కా ఆధారాలతో పట్టుకుంటున్నారు. నెల రోజుల నుంచి రోజుకు కొంతమందిని పక్కా సమాచారంతో అరెస్టు చేస్తున్నారు. ప్రస్తుతం చిక్కిన మహిళ ఇచ్చిన సమాచారం ప్రకారం.. దూల్‌పేట్ నుంచి గంజాయిని తీసుకొచ్చి ప్యాకెట్లుగా మారుస్తున్నారు. వాటిని విద్యార్థులకు, కూలీలకు అమ్ముతున్నారు. 39 ఏళ్ల అనురాధ నానక్‌రామ్‌గూడలో నివాసం ఉంటున్నారు. ఆమె వద్ద నుంచి 39 ప్యాకెట్లలో ఉన్న 300 గ్రాముల గంజాయితోపాటు 1200 నగదు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ లోని ఆసుపత్రిలో ప్రమాదం
హైదరాబాద్‌లోని చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆసుపత్రిలో ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. యునాని ఆసుపత్రిలోని ఎలక్ట్రిక్ పూల్‌లో ఈ దుర్ఘటన జరిగింది.
రంగారెడ్డిలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా కార్డ్ బోర్డు స్క్రాప్ గోదాంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపు చేశారు. సుమారు 7 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.
విశాఖలో వన్యప్రాణుల రవాణా
విశాఖ జిల్లాలో వన్యప్రాణులను రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఇలాంటి రవాణా జరుగుతోందని ముందే తెలుసుకున్న పోలీసులు… గోపాలపట్నంలో తనిఖీలు చేపట్టారు. అనుకున్నట్టుగానే ఇద్దరు చిక్కారు. వారి వద్ద నుంచి రెండు నెమళ్లు, దుప్పి కొమ్ములు, స్టార్ తాబేళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడకు రవాణా చేస్తున్నారన్న అంశంపై విచారణ చేస్తున్నారు. దీనిపై అటవీ అధికారులకు సమాచారమిచ్చారు పోలీసులు
Source link
previous post